మాజీమంత్రి, వైఎస్సార్సీపీ ప్రకాశం జిల్లా అధ్యక్ష్యుడు వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడు జగన్ స్వయానా మామా అని పిలిచే బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. బాలినేని ఓ స్థానిక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈరోజు ఉదయం తన కారులో ఒంగోలు నుంచి త్రోవగుంటకు వెళుతున్నారు. కారు మంచి స్పీడ్ లో ఉండగా కారు టైరు పేలిపోవడంతో కారు రోడ్డు పక్కకు దూసుకుపోయింది. అదే సమయంలో ఒక వ్యక్తి బైక్ తో అటు వైపుగా రావడంతో ఆయన్ని కారు ఢీకొన్నది ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయన్ని వేరే వాహణలో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాలినేని కూడా వేరే వాహనంలో అక్కడి నుండి వెళ్ళిపోయారు.