గుడ్‌న్యూస్‌.. ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేత్త

CM Chandrababu Naidu
CM Chandrababu Naidu

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ రోజు నుంచి జూన్‌ 2 వరకు రాష్ట్రంలోని ఉద్యోగుల బదిలీలకు అనుమతి ఇస్తూ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల సాధారణ బదిలీలపై నిషేధం ఎత్తివేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉద్యోగుల బదిలీలపై మే 16 నుండి జూన్ 2 వరకు నిషేధాన్ని సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మే 16 నుంచి జూన్‌ 2 వరకు సాధారణ బదిలీలకు సైతం అనుమతి ఇస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. మే 31, 2025 నాటికి ఒకే చోట ఐదేళ్లు గడిచిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను కచ్చితంగా బదిలీ చేయాలని తాజా ఉత్తర్వుల్లో ఆదేశాలు జారీ చేసింది.