మార్చి 31 వరకు రాష్ట్రంలో అన్ని బంద్

మార్చి 31 వరకు రాష్ట్రంలో అన్ని బంద్

మహమ్మారి కరోనా వైరస్ బీభత్సంగా వ్యాపిస్తున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. కాగా రాష్ట్రంలో నేటి నుండి మార్చి 31 వరకు రాష్ట్రంలో ఉన్న అన్ని విద్యాసంస్థలు, మాల్స్, రెస్టారెంట్ లు, పబ్ లు, థియేటర్స్ ఇలా అన్నీకూడా మూసివేయాలని, ఎవరైనా ఈ నిబంధనలను అతిక్రమిస్తే వారిపై తీవ్రమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. అయితే ఈ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వలన తెలుగు చిత్ర పరిశ్రమ షాక్ లో ఉన్నదని తాజా సమాచారం…

ఎందుకంటే రానున్న ఉదాగి పర్వదినాన్ని పురస్కరించుకొని మార్చి 25 న ఒరేయ్ బుజ్జిగా, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా…? అనే చిత్రాలు విడుదలవనున్నాయి… అందుకు తగ్గట్టుగానే సినిమాని బాగానే ప్రమోషన్స్ కూడా చేసుకున్నారు. కానీ ఇలా కరోనా వైరస్ కారణంగా ఇలా సినిమా హాళ్లు మూసేస్తే తమకు చాలా నష్టాలు వస్తాయని చిత్ర నిర్మాతలందరూ కూడా ఆలోచనల్లో పడ్డారని సమాచారం. కానీ మాల్స్, థియేటర్లు, ఫంక్షన్ హాల్స్ కు సెలవులు ప్రకటిస్తూ జిహెచ్ఎమ్ సి ఇచ్చిన ఆదేశాల ప్రకారం చూస్తే థియేటర్ల సెలవులు 21 వరకే అని పక్కాగా అర్థమవుతుంది. అంటే మన రాష్ట్రంలో సెలవులు 21 వరకే అని సమాచారం. కానీ ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు…