పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు శృతి హాసన్ ప్రధాన పాత్రల్లో, దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గబ్బర్ సింగ్ మూవీ . పవన్ బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్ 2 వ తేదీన మళ్ళీ థియేటర్లలోకు రాబోతుంది. ఈ రీ-రిలీజ్ ని ఫ్యాన్స్ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయనున్నారు. ఈ మూవీ ని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మించాడు.
సోషల్ మీడియాలో ఒక అభిమాని బండ్ల గణేష్ ని సంధ్య థియేటర్ కు గబ్బర్ సింగ్ చూసేందుకు రమ్మన్నాడు. అందుకు బండ్ల గణేష్ బాగా రెస్పాండ్ అయ్యాడు. తన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో వస్తా అని అంటూ చెప్పుకొచ్చారు . వెళ్దాం పద అన్నా అని అంటూ హరీష్ శంకర్ సైతం స్పందించారు . రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించారు . ఈ మూవీ రీ-రిలీజ్ ఎలాంటి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.