టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్‌లో 58.3 ఓవర్లలో 150 పరుగులకే అవుట్ అయింది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు సాధించగా, అశ్విన్, ఇషాంత్, ఉమేశ్‌లు తలో రెండు వికెట్లు సాదించారు. టాస్ గెలిచాక బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుని మొదటిలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. టీమిండియా బౌలర్లు మహ్మద్ షమీ ఇషాంత్ శర్మ అశ్విన్ ఉమేశ్ యాదవ్ ఆడగా టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే వెనుకంజ వేసింది.
బంగ్లాదేశ్ జట్టులో ముష్ఫికర్ రహీమ్ భారత బౌలర్లకి ఎదురు నిలిచి తర్వాత రనౌట్‌గా వెలి పోయాడు. మూడు వికెట్లు, రెండో సెషన్‌లో నాలుగు వికెట్లు తొలి సెషన్‌లో కోల్పోయిన బంగ్లాదేశ్ చివరి సెషన్ ఆరంభం లోనే మిగిలిన మూడు వికెట్లు నష్ట పోయింది. 58.3ఓవర్లలోనే ఆల్ అవుట్ అయింది.
ఇప్పటి వరకూ ఆరు టెస్టు మ్యాచ్ ల్లో భారత్‌తో ఆడిన బంగ్లాదేశ్ ఏ ఒక్క టెస్టు మ్యాచ్‌లో విజయం సాదించలేదు. బంగ్లాదేశ్ కెప్టెన్ మొమినుల్ హక్ బ్యాటింగ్ ఎంచుకోగా తొలి సెషన్‌లోనే ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ తలో వికెట్ పడగొట్టి బంగ్లాదేశ్‌ని ఓటమిపాలు అయ్యేలా చేశారు. రెండో సెషన్‌లో స్పిన్నర్ అశ్విన్ కెప్టెన్ మొమినుల్ వికెట్ తీసి మహ్మదుల్లానీ ఓడించాడు. చివరలో మళ్లీ షమీ, ఇషాంత్ శర్మ రెండు విక్కెట్స్ తీసి హుస్సేన్‌ని బౌల్డ్ చేశాడు.