వచ్చే ఏడాది ఐపీఎల్ వేలానికి ముందు జట్లు రిటైన్ చేసుకోబోయే ఆటగాళ్ల సంఖ్యపై బీసీసీఐ ఓ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఎనిమిది ఫ్రాంచైజీలు నలుగురు ఆటగాళ్లను నిలుపుకునేందుకు అవకాశం ఉంటుందని ఓ ప్రముఖ స్పోర్ట్స్ వెబ్సైట్ పేర్కొంది. రిటైన్ చేసుకునే ఆటగాళ్లలో ముగ్గురు భారతీయ ఆటగాళ్లతో పాటు ఓ విదేశీ ఆటగాడు ఉంటాడని సమాచారం.ఇదిలా ఉంటే, ఆటగాళ్లను అట్టిపెట్టువడంపై ప్రస్తుత ఛాంపియన్ సీఎస్కే యాజమాన్యం ఇది వరకే ఓ క్లారిటీ ఇచ్చింది.
జట్టు సారధి ధోనిని రిటైన్ చేసుకోనున్నట్లు స్వయానా ఆ ఫ్రాంచైజీ యజమానే వెల్లడించారు. రిటైన్ చేసుకునే ఆటగాళ్ల సంఖ్యపై తాజాగా ఓ క్లారిటీ రావడంతో మిగిలిన ముగ్గురు ఆటగాళ్లపై కూడా సీఎస్కే యాజమాన్యం ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ధోని సహా రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్‌లను స్వదేశీ ఆటగాళ్ల కోటాలో.. విదేశీ ప్లేయర్స్ కోటాలో బ్రావో లేదా డుప్లెసిస్‌లలో ఒకరిని రిటైన్ చేసుకునే అవకాశం ఉన్నట్లు సీఎస్కే వర్గాల సమాచారం.