బీసీసీఐలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 21న మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల వల్ల సుప్రీం కోర్టు నియమించిన క్రికెట్ పాలక కమిటీ (సీఓఏ) వచ్చేనెల 22న కాకుండా ఒక రోజు ఆలస్యంగా 23న నిర్వహించబోతుంది .
ఇదే కాకుండా రాష్ట్ర క్రికెట్ సంఘాల ఎన్నికల గడువును కూడా బీసీసీఐ పొడిగించింది. ఈ రెండు రాష్ట్రాలు హరియాణా, మహారాష్ట్రలలో శాసనసభ ఎన్నికలు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ) చైర్మన్ వినోద్ రాయ్ తెలిపారు