- Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సుప్రీంకోర్టు ఆధేశాల మేరకు లోథా కమిటీ చేసిన సూచనలు క్రికెటర్లు పుట్టిముంచేలా కనిపిస్తున్నాయి. నాలుగు చేతులా సంపాదనకు అలవాటుపడ్డ క్రికెటర్లు ఇప్పుడు కుడితలో పడ్డ ఎలుకల్లా కొట్టుమిట్టాడుతున్నారు. చివరకు బీసీసీఐ కూడా లోథా సిఫార్సులు ఫాలో అవుతూ.. క్రికెటర్లు ఉద్యోగాలు చేయకూడదని రూల్ పెట్టింది.
కెప్టెన్ కోహ్లీ సహా తాజా, మాజీలు చాలా మంది కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు వెలగబెడుతున్నారు. అయితే వారు ఏరోజూ ఉద్యోగం చేసిన పాపాన పోలేదు. మ్యాచులన్నప్పుడు కుదరకపోయినా.. కనీసం లేని సమయంలో కూడా ఆఫీసుకు వెళ్లలేదు. అదేమంటే యాడ్స్ చేసుకుంటే బిజీగా ఉన్నారు. కానీ ఒకటో తేదీన ఠంచనుగా జీతం మాత్రం తీసుకుంటున్నారు.
క్రికెటర్ల ఉద్యోగాలు కూడా ద్వంద్వ ప్రయోజనాల కిందకు వస్తాయని, వెంటనే రాజీనామాలు చేయాలని బోర్డు హెచ్చరించింది. దీంతో క్రికెటర్లు అయోమయంలో పడ్డారు. ప్రభుత్వ ఉద్యోగం వదులుకుంటే.. క్రికెట్ కెరీర్ ఎన్నాళ్లుంటుందని వారు ఆలోచిస్తున్నారు. కానీ తప్పదు మరి బీసీసీఐ కదిలాక.. క్రికెటర్ల ఎక్కువ కాదు కదా.
మరిన్ని వార్తలు