ఐటీ ఉద్యోగుల్లారా జర జాగ్రత్త.. మీ ఆరోగ్యం ఎంత ప్రమాదంలో ఉందో తెలుసా?

Be careful IT employees.. Do you know how much your health is at risk?
Be careful IT employees.. Do you know how much your health is at risk?

ఐటీ ఉద్యోగం అంటే.. ఐదంకెల జీతం, హై ఫై లైఫ్. అబ్బో వారి లైఫ్ స్టైలే వేరు. కానీ అది నాణేనికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు ఆహారపు అలవాట్లు ,గంటలకొద్దీ కూర్చొని పని చేయటం, పని ఒత్తిడి ఇది నాణేనికి . ఇదే వారిని అనారోగ్యం బారిన పడేలా చేస్తుంది. చాలా మంది ఐటీ ఉద్యోగులు తమ విభిన్నమైన లైఫ్ స్టైల్ కారణంగా పలు రకాల రోగాలను కొనితెచ్చుకుంటున్నారు. ఈ విషయం జాతీయ పోషకాహార సంస్థ (NIN) ఓ రిపోర్టు ద్వారా వెల్లడించింది.

ఇటీవల ప్రముఖ ఐటీ సంస్థల్లో హైదరాబాద్‌ నగర కేంద్రంగా పని చేస్తున్న 183 మంది ఐటీ ఉద్యోగులపై అధ్యయనం చేశారు. వారి శరీరక శ్రమ, ఆహారపు అలవాట్లు, పని విధానం ఇలా పలు అంశాలపై అధ్యయనం చేశారు. ఆ వివరాలను ఆగస్టు 2023 సంచికలో ఇంటర్నేషనల్ పీర్‌ రివ్యూడ్‌ జర్నల్‌ ‘న్యూట్రియంట్స్‌’ ప్రచురితమయ్యాయి. ఈ అంశంపై మరింత లోతుగా NIN శాస్త్రవేత్తల బృందం రీసెర్చ్ చేసింది. ప్రతి 10 మంది ఐటీ ఉద్యోగుల్లో ముగ్గురు రక్తపోటు (బీపీ), ఊబకాయం (అధిక బరువు), మధుమేహం (షుగర్) వంటి వ్యాధులబారిన పడుతున్నారని పేర్కొంది.

ఐటీ ఉద్యోగుల్లో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో బాధపడుతున్నట్లు తేలింది. ఆడవారిలో 80 సెంటీమీటర్లు ,మగవారిలో 90 సెంటీ మీటర్లు చుట్టుకొలత కంటే ఎక్కువ ఉంటే.. జీవనశైలి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని NIN హెచ్చరించింది. ఐటీ ఉద్యోగులు సగటున 8 గంటల కంటే ఎక్కువ సమయం కూర్చునే పని చేస్తున్నారని సర్వేలో తేలింది. 22 శాతం మంది ఉద్యోగులు మాత్రమే వారంలో నిర్దేశించిన 150 నిమిషాల పాటు వ్యాయామం చేస్తున్నారని,78 శాతం మంది ఐటీ ఉద్యోగులు ఎక్సర్‌సైజ్‌లకు దూరంగా ఉన్నారని కేవలం పేర్కొంది.

బీపీ, షుగర్ ,అధికబరువు బారినపడేవారు 26 నుంచి 35 ఏళ్ల లోపు మధ్య వయసువారు కూడా ప్రమాదంలో ఉన్నారని హెచ్చరించింది. తరచూ జంక్ ఫుడ్స్ తినటం, తినే ఆహారంలో కురగాయలు, పండ్లు తక్కువగా తీసుకోవడం, టైమ్‌కు తినకపోవటం, భోజనం మానేయడం వంటి అలవాట్లు ఐటీ ఉద్యోగులను లాంగ్‌టైమ్‌లో వ్యాధులబారిన పడేట్లు చేస్తాయని తెలిపారు. 30 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న సీనియర్‌ ఉద్యోగుల్లో పని ఒత్తిడి అధికంగా ఉందని.. వారిలో జీవనశైలి ప్రమాద కారకాలు ఎక్కువగా కనిపించాయని తెలిపారు. మెుత్తంగా ఐటీ ఉద్యోగుల్లో 66 శాంతి మంది చెడు కొవ్వుతో, 44 శాతం మంది అధిక బరువుతో, 4 శాంత మంది షుగర్‌తో బాధపడుతున్నట్లు తేలింది. మంచి ఆహారపు అలవాట్లు, ఎక్సర్‌సైజులు, తగిన విశ్రాంతి తీసుకోవటం ద్వారా రోగాల ముప్పు నుంచి తప్పించుకోవచ్చునని చెప్పారు.