తాజ్మహల్ సుసంపన్నమైన, వైవిధ్యమైన భారతీయ సాంస్కృతిక సౌందర్యానికి కాలాతీతమైన చిహ్నమని సందర్శకుల పుస్తకంలో ట్రంప్ రాశారు.అహ్మదాబాద్ నుంచి ఆగ్రాకు వెళ్తున్నప్పుడు ఎయిర్ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్ బీబీసీ ప్రతినిధి అలీమ్ మక్బూల్తో మాట్లాడుతూ, “క్రికెట్ స్టేడియంలో స్వాగతం ఎంతో ఘనంగా ఉంది. వాణిజ్య ఒప్పందాలకు విషయంలో మేమేమీ తొందరపడడం లేదు. తాజ్మహల్ గురించి విన్నాను. కానీ, ఎప్పుడూ చూడలేదు” అని అన్నారు.రెండు రోజుల పర్యటనలో భాగంగా ట్రంప్ సోమవారం భారత్ చేరుకున్నారు. అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ట్రంప్ దంపతులకు రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు.