మన చిత్ర పరిశ్రమలో ఈ మధ్యకాలంలో వరుసగా విషాదాలు చోటు చెస్కుటూనే ఉన్నాయి . ఇప్పటికే వివిధ కారణాలవల్ల చాలామంది ప్రముఖ నటీనటులు ఇండస్ట్రీకి దూరమయ్యారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి చాలామంది సినీ ప్రముఖులు మరణించి ఉన్నారు . కరోనా మహమ్మారితో కొంతమంది మరణించగా మరికొంతమంది మాత్రం గుండెపోటుతో ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోయారు . అయితే తాజాగా తమిళ చిత్ర పరిశ్రమలో ఒక విషాదం చోటుచేసుకుంది.
తమిళ నటుడు, బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్నది . విజయ్ ఆంటోనీ పెద్ద కుమార్తె మీరా ఆత్మ హత్య చేసుకుంది. చెన్నైలోని నివాసంలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఉదయాన్నే లేచిన వెంటనే ఇంట్లో వాళ్ళు చూసేసరికి ఆమె ఉరేసుకుని కనిపించగా… వెంటనే హాస్పిటల్ కు తరలించారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విజయ్ ఆంటోనీ పెద్ద కుమార్తె మీరా వయసు 16 ఏళ్లు మాత్రమే అంట .
తీవ్రమైన ఒత్తిడితోనే ఉరేసుకుని ఆత్మ హత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. చెన్నైలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో మీరా 12వ తరగతి చదువుతోంది. విజయ్ నిర్మాత ఆయిన ఫాతిమాను 2006లో వీళ్లిద్దరు వివాహం చేసుకున్నారు. వీరికి మీరా విజయ్ ఆంటోనీ, లారా విజయ్ ఆంటోనీ అనే ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. ఇప్పుడు మీరా ఆత్మ హత్య చేసుకోవడంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక విజయ్ ఆంటోనీ కూతురు మరణించడం పట్ల సినీ ప్రముఖులు ఆ… పాపా కి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ కుటుంబానికి భరోసా కల్పించేందుకు ఆయన ఇంటికి వస్తున్నారు సినీ ప్రముఖులు.