బేగంపేట మెట్రోస్టేషన్ మూసేశారు. భద్రతాకారణాల దృష్ట్యా బేగంపేట మెట్రో స్టేషన్ను మూసేస్తున్నామని… రైళ్లు ఇక్కడ ఆగవని మెట్రో అధికారులు ప్రకటించారు. ప్రతిస్టేషన్లోనూ ప్రయాణీకుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువస్తున్నారు. ఇదిలా ఉంటే ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చిన నేపథ్యంలోనే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రగతి భవన్కు సమీపంలోనే బేగంపేట రైల్వేస్టేషన్ ఉండటం.. ఆందోళనకారులు అక్కడి నుంచి ముట్టడికి యత్నించే అవకాశం ఉండటంతో.. ముందస్తు చర్యల్లో భాగంగా స్టేషన్ను అధికారులు మూసేశారని సమాచారం. ప్రగతిభవన్ దగ్గర పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.