ఏపీ సీఎం జగన్‌కి మరో షాక్ తగిలింది. జగన్ అధికారంలోకి వచ్చిన ఈ ఆరు నెలలలోనే కొందరు వైసీపీ నేతల మధ్య వాగ్విదాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారంలో ఉన్నా కూడా ఒక నేత తీరు ఒక నేతకు నచ్చక పార్టీనీ వీడుతున్నారు.అయితే తాజాగా వైసీపీ యువత అధ్యక్షుడు బెజ్జం రాంబాబు వైసీపీకి రాజీనామా చేశారు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తీరు నచ్చక ఆయన పార్టీనీ వీడారు. ఎమ్మెల్యే శ్రీదేవి అవినీతి చర్యలకు పాల్పడుతుందంటూ నిరసన వ్యక్తం చేస్తూ బెజ్జం రాంబాబు తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు.