నిజంగా బరువు పెరగకుండా ఉండాలంటే ఫ్యాట్ వున్న ఆహార పదార్థాలను తీసుకోకూడదనే అనే విషయంపై డాక్టర్ కొన్ని ముఖ్యమైన విషయాలని చెప్పారు. దీనిని కనుక చూశారంటే మీకు తెలియని ఎన్నో విషయాలు తెలుస్తాయి. అలాగే ఫ్యాట్ వుండే ఆహారపదార్ధాలు ఎంత ముఖ్యమో కూడా తెలుస్తుంది. అయితే మరి ఇంక ఆలస్యం ఎందుకు దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి.
కొవ్వు పదార్థాలు మనకి కావాల్సిన మైక్రో-నూట్రియెంట్స్‌లో ఒకటి. మన బాడీకి ఫ్యాట్ ఫుడ్ కూడా అవసరం. అయితే అందరూ ఒకేలా ఉండరు. ఒక్కొక్కరు ఒక్కొక్క లాగ ఉంటాం. అయితే ఎవరికైనా సరే 25 శాతం నుండి 30 శాతం వరకు కేలరీలు కొవ్వు పదార్థాలు ద్వారా అందాలి. ప్రతి మీల్‌లో కూడా ఫ్యాట్ అనేది ఉంటూ ఉండాలి.
అయితే పోషక పదార్థాలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని చాలా మంది కేవలం పోషక పదార్థాలని మాత్రమే తీసుకుంటూ వుంటారు. ఫ్యాట్స్ అస్సలు తీసుకోరు. ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను మాత్రమే తీసుకుంటారు. కానీ నిజానికి ఫ్యాట్స్ కూడా తీసుకుంటూ ఉండాలి. ఫ్యాట్ ఉన్న ఆహార పదార్థాలు మనకు డైట్‌లో చాలా అవసరం. లావు అయిపోతున్నాను అన్న కారణంతో చాలా మంది మొత్తానికి ఫ్యాట్ తీసుకోరు. దాని వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని డాక్టర్ చెప్తున్నారు.
ఇప్పటి వరకు ఫ్యాట్ తప్పక తీసుకోవాలనేది తెలుసుకున్నాం. ఇప్పుడు ఎందుకు అవసరం అనేది కూడా చూద్దాం. డాక్టర్ చెబుతున్నదాని ప్రకారం ఫ్యాట్ అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఎక్కువ కేలరీలు ఉంటాయి. పైగా ఎనర్జీని స్టోర్ చేయడానికి అది ముఖ్యమైన పద్ధతి. పైగా ఫ్యాట్ ద్వారా కూడా మనకి కొన్ని పోషక పదార్థాలు అందుతాయి. విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె, యాంటి ఆక్సిడెంట్స్ మరియు బీటా కెరోటిన్ వంటివి కూడా ఫ్యాట్ ద్వారా మనకు అందుతాయి.
ఇవన్నీ కూడా మనకి చాలా అవసరం. తప్పకుండా తీసుకోవాలి. అంతే కానీ కేవలం లావైపోతారు అని మాత్రం వాటిని దూరం పెట్టొద్దు. ఇలా దూరం పెట్టడం వల్ల శరీరానికి అవసరమైన పోషక పదార్థాలు చాలా మటుకు అందవు. అదే విధంగా సెల్స్‌కి స్ట్రక్చర్స్‌ని ఇవ్వడానికి కూడా చాలా ముఖ్యం.
వీటి అన్నింటికీ కూడా ఫ్యాట్ అవసరం. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక మీల్‌లో కూడా ఫ్యాట్ ఫుడ్ ఉండేటట్టు చూసుకోవాలి. అలా అని అతిగా తీసుకోకూడదు. అలా అని మొత్తానికి తీసుకోవడం మానేయకూడదు. శరీరానికి అవసరమైన పోషక పదార్ధాలు వాటి ద్వారా కూడా అందుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాస్త కొవ్వు వుండే ఆహార పదార్ధాలని తీసుకుంటూ ఉండాలి.
ఇదిలా ఉంటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేది అన్సాచురేటెడ్ ఫ్యాట్. ఇది బ్రెయిన్ మరియు హార్ట్ ఫంక్షన్‌కి అవసరం. వర్కౌట్స్ చేసే వాళ్ళకి కూడా ఫ్యాట్ చాలా అవసరం. ఇంఫ్లేమేషన్‌ని కంట్రోల్ చేయడానికి కూడా ఫ్యాట్ మనకి ఉపయోగ పడుతుంది అలాగే ఇతర ప్రయోజనాలు ఎన్నో పొందొచ్చు. కాబట్టి తింటే లావైపోతారు అని మాత్రం మానకండి. కొన్ని ఫ్యాట్ ఫుడ్‌ని తీసుకోవడం కూడా చాలా ముఖ్యం అని తెలుసుకుని ఆలివ్ ఆయిల్, కొబ్బరి ముక్క ఇలా ఏదో ఒకటి డైట్‌లో తీసుకుంటూ ఉండండి.
ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రతి పూట తీసుకుంటూ ఉండాలి. వాటిలో కొవ్వు పదార్ధాలు కూడా ఉండేటట్టు చూసుకోవాలి. కాబట్టి పూర్తిగా ఫ్యాట్స్‌ని మానేసిన వాళ్ళు తిరిగి తినడం అలవాటు చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఆరోగ్యంగా ఉండడానికి ఫ్యాట్స్ కూడా అవసరం కనుక. ఇలా మీరు ఫ్యాట్ వున్నా ఆహార పదార్ధాలని తింటే ఇబ్బందులు వుండవు అలానే ఇంకా మేలే కూడా.
అయితే ఇక్కడ ఓ విషయం గమనించాలి.. మంచిది కదా అని అన్ని కొవ్వు పదార్థాలు తినకూడదు. హెల్దీ ఫ్యాట్స్ మాత్రమే ఆరోగ్యానికి మంచిది. అవేంటో తెలుసుకుని వాటినే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.