టమోటాలు కాస్త పుల్లగా, తియ్యగా ఉంటాయి. ఇవి కాన్సర్ సెల్స్తో పోరాడగలవు. అయితే కొత్త స్టడీ ప్రకారం స్టమక్ కాన్సర్ సెల్స్ ఎదగకుండా పోరాడి స్టమక్ కాన్సర్ నుండి రక్షిస్తాయి అని నిపుణులు తెలిపారు.
అదే విధంగా టమాటా వలన మరెన్నో ముఖ్యమైన ప్రయోజనాలు ఉన్నాయి. మరి వాటి కోసం కూడా ఒక లుక్ వేసేయండి. ఆరోగ్యానికి టమోటాలు ఎంతగానో మేలు చేస్తాయి. నిజంగా టమాటా వల్ల కలిగే ప్రయోజనాలు చూశారంటే షాక్ అవుతారు. ఒకటి కాదు రెండు కాదు టమాటాలు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
టమోటాల్లో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కె, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. అదే విధంగా టమోటాలలో సహజంగా సోడియం, కొవ్వు, కొలెస్ట్రాల్, కేలరీలు తక్కువగా ఉంటాయి. నిజంగా ఆరోగ్యానికి ఇది చాలా అవసరం అని చెప్పవచ్చు.
టమాటాలో విటమిన్ b6, మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాపర్ కూడా ఉంటాయి. ఆరోగ్యానికి అందానికి నిజంగా ఎంతో మేలు చేస్తుంది టమాటా. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, స్ట్రోక్, గుండె సమస్యలు వంటి వాటి నుండి కూడా రక్షిస్తుంది. ఎముకలని గట్టిగా చేయడానికి కూడా టమాటా బాగా ఉపయోగపడుతుంది.
దీనిలో ఉండే విటమిన్ కె, కాల్షియం ఎముకలని సరి చేస్తాయి. అదే విధంగా ఎముకలను బలపరుస్తాయి. బ్లడ్ షుగర్ని బ్యాలన్స్ చేయడానికి కూడా టమాటాలు బాగా ఉపయోగపడతాయి. కంటి ఆరోగ్యానికి కూడా టమాటాలు ఎంతగానో మేలు చేస్తాయి. టమాటాలో ఉండే విటమిన్ ఏ దృష్టిని మెరుగుపరిచి రేచీకటి తగ్గించడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది.
తీవ్రమైన కంటి సమస్యలని తగ్గించడానికి కూడా ఇది ఎంతో బాగా పని చేస్తుందని నిపుణులు అంటున్నారు మూత్రపిండాల్లో రాళ్ళు, పిత్తాశయంలో రాళ్ళు నివారించడానికి కూడా ఉపయోగపడుతుంది. మూత్రపిండాలు, పిత్తాశయంలో రాళ్ళు గింజలు లేని టమాటాలు తినే వారిలో చాలా తక్కువ ఏర్పడతాయని రీసెర్చ్ ద్వారా తెలుస్తోంది.