ప్రొ కబడ్డీ ఫైనల్లో బెంగాల్ వారియర్స్ 39-34 తేడాతో గెలిచింది. తొలిసారి ఫైనల్‌కి చేరిన దబాంగ్ ఢిల్లీ టైటిల్‌ని చేజార్చుకున్నది. ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్ ఈ ఫైనల్‌తో ముగిసింది. మొత్తం 12 జట్లు ఈ ఏడో సీజన్‌లో పోటీ పడ్డాయి. టాప్6 లో లీగ్ దశ ముగిసే సమయానికి కొన్ని జట్లు ప్లేఆఫ్‌కి అర్హత సాదించాయి. సెమీ ఫైనల్స్ తర్వాత దబాంగ్ ఢిల్లీ, బెంగాల్ వారియర్స్ ఫైనల్‌కి వచ్చాయి.
మొదట దబాంగ్ ఢిల్లీ 6-0 తో ముందు స్థానంలో ఉన్నపుడు బెంగాల్ వారియర్స్ ఒక పాయింట్ కూడా సాదించలేదు. వరుస రైడ్ పాయింట్లతో కెప్టెన్ మహ్మద్ బెంగాల్ వారియర్స్‌ని మ్యాచ్‌లోకి తీసుకొచ్చి, మహ్మద్ 13సార్లు రైడ్‌కి వెళ్లగా 9పాయింట్స్ సాదించాడు. మ్యాచ్ హాఫ్ టైమ్ సమయానికి 17-17 స్కోర్ తో నిలిచింది.
సెకండ్ హాఫ్ లో మొదట ఐదు నిమిషాలు దబాంగ్ ఢిల్లీ బెంగాల్ వారియర్స్‌కి పోటీనివ్వగా వరుసగా సూపర్ రైడ్‌లతో మహ్మద్ దబాంగ్ ఢిల్లీని ఆలౌట్ చేశాడు. దీనితో బెంగాల్ వారయర్స్ 30-24తో ముందు ఉంది.