‘భాగమతి’ మతులు పోగొడుతూనే ఉంది

bhagmati new poster release

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

దేవసేన అనుష్క వచ్చే నెలలో ‘భాగమతి’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ‘పిల్ల జమీందార్‌’ ఫేం అశోక్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ నిర్మాతలు వంశీ మరియు ప్రమోద్‌లు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని చాలా వారాలు అయ్యింది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతుంది. సినిమాలో గ్రాఫిక్స్‌ శాతం కాస్త ఎక్కువగానే ఉంటుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. అందుకే విజువల్‌ ఎఫెక్ట్స్‌ వర్క్‌కు ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. ఇక తాజాగా కొత్త సంవత్సరం సందర్బంగా మరో పోస్టర్‌ను చిత్ర యూనిట్‌ సభ్యులు విడుదల చేశారు.

anushka

‘భాగమతి’ చిత్రంలో అనుష్క ఒక ఐఏఎస్‌ ఆఫీసర్‌గా కనిపించబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. చిత్ర యూనిట్‌ సభ్యులు కూడా అదే విషయాన్ని ఆఫ్‌ ది రికార్డ్‌ చెప్పుకొచ్చారు. కాని ఇప్పటి వరకు విడుదలైన టీజర్‌ మరియు పోస్టర్‌లను చూస్తుంటే ఇదేదో హర్రర్‌ సినిమా అంటూ అభిప్రాయం ఏర్పడుతుంది. మొదటి పోస్టర్‌లో చేతికి మేకు కొట్టుకుని అందరిని ఒణికించిన అనుష్క ఇప్పుడు కొత్త పోస్టర్‌తో బాబోయ్‌ ఏంటీ అనుష్క అన్నట్లుగా ఉంది.

anushka Bhaagamathie New Year Poster

అనుష్క సినిమా మొత్తంలో కూడా ఇదే గెటప్‌తో ఉంటుందా ఏంటీ అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అనుమానాలు పటా పంచలు అవ్వాలి అంటే ట్రైలర్‌ విడుదల అవ్వాలి. జనవరి 26న రిపబ్లిక్‌ డే సందర్బంగా చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అనుష్క నటన విశ్వరూపంను చూస్తారంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ప్రభాస్‌ ప్రత్యేక పాత్రలో కనిపిస్తాడనే వార్తలు కూడా వస్తున్నాయి. మొత్తానికి ‘భాగమతి’ చిత్రం ప్రేక్షకుల మతులు పోగొడుతూనే ఉంది. విడుదలై తర్వాత ఇంకెలా ఉంటుందో చూడాలి.