బాలీవుడ్‌ మూవీపై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్‌

prabhas gives clarity on bollywood movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ‘బాహుబలి’ చిత్రంతో స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. బాలీవుడ్‌లో కూడా ప్రస్తుతం ప్రభాస్‌ రేంజ్‌ ఆకాశాన్ని తాకేలా ఉంది. భారీ ఆఫర్ ప్రభాస్‌కు వస్తున్నాయి. అయితే ప్రభాస్‌ మాత్రం ‘బాహుబలి’ తర్వాత సినిమాను తెలుగులో స్నేహితుల బ్యానర్‌ అయిన యూవీ క్రియేషన్స్‌లో ‘సాహో’ అంటూ చేస్తున్న విషయం తెల్సిందే. ఇక ప్రభాస్‌ ఒక బాలీవుడ్‌ సినిమాకు కమిట్‌ అయ్యాడు అంటూ గత కొన్నాళ్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాని కొందరు మాత్రం ఆ వార్తలను కొట్టి పారేస్తూ వస్తున్నారు. ప్రభాస్‌కు తెలుగు సినిమాలపైనే ఎక్కువ ఆసక్తి, హిందీలో సినిమా చేయాలని ఆయనకు లేదు అంటూ కొందరు తమ అభిప్రాయంను వ్యక్తం చేశారు.

baahubali star prabhas clarity about bollywood movie

బాలీవుడ్‌లో తన సినిమా గురించి ప్రభాస్‌ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. తాను బాలీవుడ్‌ సినిమా చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు. ‘సాహో’ పూర్తి అయిన తర్వాత బాలీవుడ్‌లో సినిమా చేస్తాను అని, అది తెలుగులో కూడా ఉంటుందని చెప్పుకొచ్చాడు.

prabhas clarity on bollywood movie

బాలీవుడ్‌లో ఒక చిత్రం చేసేందుకు మూడు సంవత్సరాల క్రితం తాను సైన్‌ చేశాను అని, కథ విని బాగుందన్నాను. అయితే ప్రస్తుతానికి తాను చేయలేను అంటూ చెప్పుకొచ్చాను. అయినా కూడా వెయిట్‌ చేస్తామని సదరు సంస్థ మరియు దర్శకుడు చెప్పడంతో ఒప్పంద పత్రంపై సైన్‌ చేశాను అంటూ ప్రభాస్‌ క్లారిటీ ఇచ్చాడు. 2019లో ప్రభాస్‌ బాలీవుడ్‌ సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి. 2020కు బాలీవుడ్‌లో ప్రభాస్‌ బొమ్మ పడుతుందేమో చూడాలి.