‘అజ్ఞాతవాసి’ సెన్సార్‌ రిపోర్ట్‌

pawan-kalyan-agnathavasi-censor-talk

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం విడుదలకు కౌంట్‌ డౌన్‌ ప్రారంభం అయ్యింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘అజ్ఞాతవాసి’ చిత్రం మరో వారం రోజుల్లో విడుదలకు సిద్దం అవుతుంది. ఇప్పటికే షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకున్న ‘అజ్ఞాతవాసి’ చిత్రం తాజాగా సెన్సార్‌ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాకు అంతా ఊహించిన విధంగానే ‘యూ/ఎ’ సర్టిఫికెట్‌ దక్కింది.

pawan kalyan and trivikram agnathavasi movie

పవన్‌కు ఇది 25వ చిత్రం అవ్వడంతో సినీ వర్గాల్లో మరియు ఫ్యాన్స్‌, ప్రేక్షకులు చాలా అంచనాలు పెట్టుకుని ఉన్నారు. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు త్రివిక్రమ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ విషయం తాజాగా సెన్సార్‌ సభ్యుల స్పందన ద్వారా తెలిసి పోయింది. సెన్సార్‌ కోసం స్క్రీనింగ్‌ చేసిన సభ్యులు సినిమాపై ప్రశంసల జల్లు కురిపించినట్లుగా తెలుస్తోంది.

pawan kalyan and trivikram agnathavasi movie censor talk

దర్శకుడు త్రివిక్రమ్‌, పవన్‌ల కాంబినేషన్‌ మరోసారి సెన్షేషనల్‌ హిట్‌గా నిలవడం ఖాయం అంటూ సెన్సార్‌ బోర్డు సభ్యులు ఆఫ్‌ ది రికార్డు చెబుతున్నారు. తప్పకుండా ఇది తెలుగు సినిమా చరిత్రలో నిలిచి పోయేలా కలెక్షన్స్‌ను సాధిస్తుందని మెగా ఫ్యాన్స్‌ చాలా నమ్మకంగా ఉన్నారు. వారి నమ్మకం నిజం అవ్వడం ఖాయం అని, ఈ చిత్రం నాన్‌ బాహుబలి రికార్డులను బ్రేక్‌ చేస్తుందని సినీ వర్గాల వారు కూడా చాలా గట్టిగానే చెబుతున్నారు.