సూపర్ స్టార్ మహేష్‌బాబు, కొరటాల శివల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘భరత్ అను నేను’. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం టీజర్ తాజాగా రివీల్ అయ్యింది. సినిమా నేపథ్యం ఏంటా అని గత కొంత కాలంగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెర పడ్డట్లయ్యింది. తాజాగా చిత్రంపై ఫుల్ క్లారిటీని దర్శకుడు కొరటాల ఇచ్చేశాడు. మహేష్‌బాబు ఈ చిత్రంలో ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడు. టీజర్ చూసిన తర్వాత సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఈ చిత్రం గతంలో వచ్చిన రెండు చిత్రాల నుండి ఇన్సిఫిరేషన్‌గా తయారు అయినట్లుగా చెబుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ‘ముఠామేస్త్రీ’ మరియు అర్జున్ ‘ఒకే ఒక్కడు’ చిత్రాల నేపథ్యం నుండి ఈ చిత్రంను కొరటాల శివ తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. ఒక సాదారణ యువకుడు కొన్ని కారణాల వల్ల సీఎం అయ్యే పరిస్థితి వస్తుంది. ఆ బాధ్యతను ఎలా నెరవేర్చాడు. అంతకు ముందు ఉన్న రాజకీయ వ్యవస్థను తన కొత్త విధానాలతో ఎలా మార్చాడు, ప్రజలకు ఆయన అందించిన సేవ ఎలా ఉంటుందనేది ఈ చిత్రంలో చూపించనున్నాడు. మహేష్‌బాబు సీఎంగా తనదైన శైలితో ఆకట్టుకోబోతున్నాడు. గతంలో వచ్చిన రాజకీయ నేపథ్యం చిత్రాలు ‘ముఠామేస్త్రీ’ మరియు ‘ఒకే ఒక్కడు’ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అలాగే ఈ చిత్రం కూడా తప్పకుండా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. 200 కోట్ల వసూళ్లు లక్ష్యంగా ఈ చిత్రంను ఏప్రిల్ 20న విడుదల చేయబోతున్నారు.