ఎన్టీఆర్‌ బయోపిక్‌… రెండు పుకార్లకు క్లారిటీ

Clarity about On NTR Biopic Rumors
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

బాలకృష్ణ చాలా శ్రద్ద పెట్టి చేయబోతున్న చిత్రం ‘ఎన్టీఆర్‌’. తన తండ్రి బయోపిక్‌ను తీసేందుకు బాలయ్య చాలా ఆసక్తిగా ఉన్నాడు. గత ఆరు నెలలుగా అందుకు గాను స్క్రిప్ట్‌ వర్క్‌ జరుపుతున్నాడు. తండ్రి జీవిత చరిత్రపై రీసెర్చ్‌ చేయిస్తున్న బాలకృష్ణ తాజాగా సినిమా తేదీలపై ఒక క్లారిటీ ఇచ్చిన విషయం తెల్సిందే. తేజ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతుందని మొదట అధికారిక ప్రకటన వచ్చింది. అయితే గత కొన్ని రోజులుగా తేజను ఈ చిత్రం నుండి తప్పించినట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దాంతో పాటు యంగ్‌ ఎన్టీఆర్‌ పాత్రలో శర్వానంద్‌ నటించబోతున్నాడు అనేది కూడా వైరల్‌ వార్త అయ్యింది. తాజాగా ఈ రెండు పుకార్లపై క్లారిటీ ఇచ్చారు.

చిత్ర యూనిట్‌ సభ్యులు ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌కు తేజ దర్శకత్వం వహించడం లేదు అంటూ వస్తున్న వార్తలను కొట్టి పారేశారు. తేజ దర్శకత్వంలోనే ఎన్టీఆర్‌ చిత్రం రాబోతుందని క్లారిటీ ఇచ్చారు. దాంతో పాటు ఎన్టీఆర్‌ యంగ్‌ ఏజ్‌ పాత్రను శర్వానంద్‌ చేయబోతున్నట్లుగా వస్తున్న వార్తలను కూడా కొట్టి పారేశారు. ఎన్టీఆర్‌ బయోపిక్‌లో ఇతర ఏ హీరో కూడా నటించబోవడం లేదని, కేవలం బాలయ్య మాత్రమే కనిపిస్తాడని చెప్పుకొచ్చారు. దాదాపు 75 గెటప్స్‌లలో బాలయ్య కనిపిస్తాడని కూడా చిత్ర యూనిట్‌ సభ్యులు తెలియజేశారు. మొత్తానికి ఎన్టీఆర్‌ బయోపిక్‌పై వస్తున్న పుకార్లపై క్లారిటీ ఇచ్చారు.