‘ఎన్టీఆర్‌’ పెద్దల్లుడికి ఇచ్చే గౌరవం ఇదేనా?

Daggubati Venkateswara Rao in NTR Biopic

నందమూరి ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ఎన్టీఆర్‌’ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌గా బాలకృష్ణ నటిస్తుండగా కీలక పాత్రలైన చంద్రబాబు నాయుడుగా రానా, బసవతారకంగా విద్యాబాలన్‌, శ్రీదేవిగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సావిత్రిగా కీర్తి సురేష్‌లు కనిపించబోతున్నారు. ఇక ఈ చిత్రంలో కీలకమైన దగ్గుబాటి వెంకటేశ్వరరావు పాత్రకు క్యారెక్టర్‌ ఆర్టిస్టు అయిన భరత్‌ను ఎంపిక చేయడం జరిగింది.

Rana daggubati and chandrababu

చంద్రబాబు నాయుడు పాత్రకు రానాను ఎంపిక చేసి, ఎన్టీఆర్‌ పెద్దల్లుడు అయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు పాత్రకు భరత్‌ను ఎంపిక చేయడం పట్ల సినీ వర్గాల్లో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్టీఆర్‌ కుటుంబంలో ముఖ్యుడు, ఎన్టీఆర్‌ రాజకీయ ఆరంభం సమయంలో చాలా కీలక పాత్ర పోషించిన వ్యక్తి అయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు పాత్రకు మంచి నటుడిని ఎంపిక చేస్తే బాగుండేది అంటూ నందమూరి ఫ్యాన్స్‌ కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Bharat Reddy as Daggubati Venkateswara Rao

ఎన్టీఆర్‌ చిన్న కూతురు అయిన భువనేశ్వరి పాత్రకు మలయాళ హీరోయిన్‌ మంజిమ మోహన్‌ను ఎంపిక చేయడం జరిగింది. ఇక పెద్ద కూతురు పురందేశ్వరి పాత్రకు గాను ఒక సాదా సీదా క్యారెక్టర్‌ ఆర్టిస్టును ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతుంది. ఈ చిత్రం మొత్తం చంద్రబాబు కను సన్నల్లో తెరకెక్కుతుందని, అందుకే ఇలా తన విరోదులు అయిన వారి పాత్రలకు ప్రాముఖ్యత లేకుండా చంద్రబాబు ప్లాన్‌ చేస్తున్నాడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఎన్టీఆర్‌ పెద్ద కూతురు మరియు పెద్ద అల్లుడికి ‘ఎన్టీఆర్‌’ చిత్రంలో కాస్త ప్రాముఖ్యత తగ్గుతుందనిపిస్తుంది. ఈ విషయమై క్లారిటీ చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి క్లారిటీ రావాల్సి ఉంది.