మెగా మూవీకి ఫిక్స్‌ అయిన గోవిందం దర్శకుడు!

director parasuram next movie with varun tej

అల్లు శిరీష్‌తో ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రంతో సక్సెస్‌ను దక్కించుకున్న దర్శకుడు పరుశురామ్‌ తాజాగా విజయ్‌ దేవరకొండతో ‘గీత గోవిందం’ చిత్రాన్ని తెరకెక్కించి సూపర్‌ హిట్‌ను దక్కించుకున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందిన గీత గోవిందం చిత్రం అంచనాలను మించి ఆకట్టుకుంది. దాంతో సినిమాకు కాసుల వర్షం కురుస్తుంది. భారీ ఎత్తున వసూళ్లు వస్తున్న నేపథ్యంలో దర్శకుడు పరుశురామ్‌తో సినిమాలు చేసేందుకు హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. గీత గోవిందం విడుదల అవ్వడమే ఆలస్యం వెంటనే మంచు ఫ్యామిలీ నుండి పరుశురామ్‌ తదుపరి చిత్రం మంచు విష్ణుతో అంటూ ప్రకటన వచ్చింది. ఆ వెంటనే గీతా ఆర్ట్స్‌ నుండి పరుశురామ్‌ వరుసగా మూడవ సినిమాను కూడా గీతాఆర్ట్స్‌లోనే చేయబోతున్నాడు అంటూ ప్రకటన వచ్చింది.

director-parasuram

ఈ రెండు ప్రకటనల నేపథ్యంలో అసలు పరుశురామ్‌ తదుపరి చిత్రం ఏ హీరోతో, ఏ బ్యానర్‌లో అనే క్లారిటీ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు అధికారికంగా క్లారిటీ వచ్చేసింది. మంచు విష్ణుతో గతంలో పరుశురామ్‌ ఒక సినిమా అనుకున్న మాట వాస్తవమే. కాని అడ్వాన్స్‌ ఏమీ తీసుకోలేదు. అందుకే మెగా బ్యానర్‌ అయిన గీత ఆర్ట్స్‌ 2లోనే చిత్రాన్ని చేయాలని పరుశురామ్‌ నిర్ణయించుకున్నాడు. తదుపరి చిత్రాన్ని మెగా హీరో వరుణ్‌ తేజ్‌తో పరుశురామ్‌ చేయబోతున్నాడు. ఈ విషయంపై దాదాపుగా క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం గీత గోవిందంకు సంబంధించిన పబ్లిసిటీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. గీత గోవిందం హడావుడి పూర్తి అయిన తర్వాత వరుణ్‌తో మూవీ విషయంలో ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

varuntej