కాస్టింగ్‌ కౌచ్‌పై డిస్కో శాంతి షాకింగ్‌ కామెంట్స్‌

disco shanthi talks about casting couch

టాలీవుడ్‌లో ఈమద్య ఎక్కడ చూసినా కూడా కాస్టింగ్‌ కౌచ్‌ గురించి చర్చ జరుగుతుంది. ఎవరిని కదిపినా కూడా కాస్టింగ్‌ కౌచ్‌ గురించి మాట్లాడుతున్నారు. తాజాగా శ్రీహరి భార్య డిస్కోశాంతి మాట్లాడుతూ కాస్టింగ్‌ కౌచ్‌ వ్యవహారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మన అవసరాలను అవతలి వారు గ్రహించినప్పుడు మన నుండి వారు అవసరం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. అలాంటి వారిని చెంప పగుల కొడితే మరోసారి అలా ప్రవర్తించరు. కాని అవసరం కోసం తలొగ్గితే ఇక అంతే. ప్రస్తుతం టాలీవుడ్‌లో జరుగుతున్న కాస్టింగ్‌ కౌచ్‌ వ్యవహారం కూడా ఇలాంటిదే అంటూ డిస్కో శాంతి చెప్పుకొచ్చింది.

disco-shanthi

కాస్టింగ్‌ కౌచ్‌ అనేది ప్రతి పరిశ్రమలో కూడా ఉన్నాయి. పని చేసే ప్రతి చోట కూడా ఉంటుంది. ఆడవారు బలహీనంగా ఉన్నప్పుడు మాత్రమే కాస్టింగ్‌ కౌచ్‌కు బలవుతుంటారు అంటూ చెప్పుకొచ్చింది. మగవాడు పిలిచినప్పుడే చెంప పగులకొడితే మరోసారి ఇలాంటివి పునరావృతం అవ్వవు అంటూ చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో ఎవరు కూడా ఆడవారిపై బలవంతంగా అనుభవించేందుకు ప్రయత్నించరు అని, అలా చేస్తే పరువు పోవడంతో పాటు, జైలుకు వెళ్తామనే భయం అందరిలో ఉంటుందని అందుకే అలాంటి పనులు చేయరు అని, వారి అవసరాలు తీర్చాల్సిందిగా మెల్లగా మాత్రమే అడుగుతారు అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి కాస్టింగ్‌ కౌచ్‌కు కారణంగా ఆడవారి అమాయకత్వం మరియు బలహీనతే అంటూ చెప్పుకొచ్చింది.

disco-shanthi