చెల్లిని కూడా వదలని కామాంధుడు !

Man rapes his own sister for one and half year

కంచే చేను మేసింది అన్న చందాన తల్లి లేని పిల్లని కంటికి రెప్పలా చుస్కోవాల్సిన సోదరుడే కీచకుడయ్యాడు. ఏడాదిన్నర కాలంగా నరకం చూపించాడు. ఎవరికైనా చెబితే చంపుతానన్నాడు. చివరికి కడుపు చేశాడు. పాపం అభం శుభం తెలీని ఆ బాలిక గురువారం రాత్రి పురిటినొప్పులతో ఆసుపత్రిలో చేరింది. మృత శిశువుకు జన్మనిచ్చింది. సభ్య సమాజం తలదించుకునే ఇలాంటి ఘటన అనంతపురం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. అన్న కామ వాంఛకు బలైన ఓ బాలిక గర్భం దాల్చి ప్రసవానికి ఆస్పత్రికి వస్తేగాని విషయం బయట పడలేదు.

Man-rapes-his-own-sister

పోలీసుల సమాచారం మేరకు అనంతపురం పట్టణ శివారులోని ఓ కాలనీలో నివాసముంటున్న బాలిక గురువారం పురిటి నొప్పులతో స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేరింది. పాఠశాల విద్యార్థిలా ఉం డటంతో అనుమానం వచ్చి డాక్టర్లు ఆరా తీయగా వెంట వచ్చిన తండ్రి బిత్తర సమాధానాలు చెప్పాడు. వైద్య పరీక్షల్లో శిశువు గర్భంలోనే మృతి చెందినట్లు డాక్టర్లు గుర్తించి వెంటనే మృతశిశువును బయటకు తీసి బాలిక ప్రాణాలకు ముప్పు లేకుండా చూశారు. వెంటనే పోలీసులకి సమాచారం ఇచ్చారు. విషయం తెలిసి ప్రభుత్వాసుపత్రికి పోలీసులు వచ్చి విచారించారు. ఆ విచారణలో ఆమె అన్న చేసిన కీచక పర్వం బయటపడింది. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్న ఆన్న ఏడాదిన్నర క్రితం నుంచి సోదరిపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. పాపం పండి ఈరోజు ఊచలు లెక్కిస్తున్నాడు.

Man-rapes