Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సినిమా రంగంలో ఉన్నప్పుడు స్నేహితులు ఉన్న వారు రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత శత్రువులు అవ్వడం కామన్. రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీల వారిని విమర్శించక తప్పదు. కాని తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లో అడుగు పెట్టాడో లేదో అప్పుడే విమర్శలు మొదలయ్యాయి. ఇంకా రజినీకాంత్ పార్టీ పెట్టకముందే అప్పుడే తమిళుడు కాని వ్యక్తి తమను పరిపాలించవద్దంటూ కొందరు నిరసనలు తెలుపుతున్నారు. అందులో ప్రధముడిగా దర్శకుడు భారతి రాజా ఉన్నాడు. తమిళ సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్న భారతి రాజా చేస్తున్న విమర్శలు ప్రస్తుతం తమిళ నాట పెను ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. రాజకీయాల్లో రజినీకాంత్ తనదైన శైలిలో రాణిస్తాడని భావిస్తున్న తరుణంలో భారతి రాజా ఇలాంటి విమర్శలు చేస్తుండటంతో రజినీకాంత్ వర్గంలో ఆందోళన మొదలైంది.
తమిళనాడు ప్రజలకు ప్రాంతీయ తత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. భాషాభిమానంతో పాటు, ప్రాంతీయాభిమానం ఎక్కువగా ఉండే తమిళ ప్రజల్లో భారతిరాజా వ్యాఖ్యలు ఖచ్చితంగా పని చేస్తాయని, భారతి రాజా చేస్తున్న విమర్శల వల్ల రజినీకాంత్ పొలిటికల్‌గా నష్టపోవడం ఖాయం అంటూ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం తమిళనాట ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రజినీకాంత్ సునాయాసంగా తమిళనాట ప్రభుత్వంను ఏర్పర్చగలరు. కాని భారతిరాజా చేస్తున్న విమర్శల కారణంగా రజినీకాంత్‌పై ప్రజల్లో వ్యతిరేకత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. సినిమా హీరోగా రజినీకాంత్‌ను ఆరాధించే తమిళ జనాలు తమ సీఎంగా రజినీకాంత్‌ను ఒప్పుకుంటారా అనే అనుమానాలు ఉన్న నేపథ్యంలో భారతి రాజా వ్యాఖ్యలు మరింతగా దుమారంను రేపుతున్నాయి. భారతి రాజాకు రజినీకాంత్‌కు సుదీర్ఘ కాలంగా విభేదాలు ఉన్నాయి. తనకు రజినీకాంత్ నమ్మక ద్రోహం చేశాడని, ఫ్యాన్స్‌ను ముంచేందుకు రవితేజ పార్టీ పెట్టి, సీఎం అవ్వాలని ఆశపడుతున్నాడు.
వయస్సులో ఉన్నంత కాలం హిమాలయాలు పట్టుకుని తిరిగిన రజినీకాంత్ వయస్సు అయిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్నాడు అంటూ దర్శకుడు భారతి రాజా ఎద్దేవ చేశాడు. రజినీకాంత్ ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా అనిపించడం లేదని, రాజకీయాల్లోకి వచ్చి తన పేరును మరింతగా పెంచుకుని, డబ్బు సంపాదించడం కోసం వస్తున్నాడని, ఇంతకాలం ప్రజల శ్రేయస్సు గుర్తుకు రాని రజినీకాంత్‌కు ఇప్పుడు ప్రజలు ఎందుకు గుర్తుకు వచ్చారు అంటూ భారతిరాజా ప్రశ్నించాడు.
రజినీకాంత్‌ను ఉపయోగించుకుని బీజేపీ తమిళనాడులో అధికారం దక్కించుకోవాలనే కుటిల ప్రయత్నాలు చేస్తుందంటూ భారతి రాజా ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమిళనాడులో కనీసం నోటాతో కూడా బీజేపీ పోటీ పడలేదు. అలాంటి బీజేపీకి రజినీకాంత్ మద్దతుగా నిలుస్తాడంటూ భారతిరాజా పేర్కొన్నాడు. భారతి రాజా విమర్శల కారణంగా రజినీకాంత్ రాజకీయ జీవితం ఖచ్చితంగా ప్రభావం చూపతుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. రాజకీయాల్లోకి రాబోతున్న సమయంలోనే తాను తమిళ వ్యక్తిని అని, తాను పూర్తిగా తమిళ వ్యక్తిని అంటూ చెప్పే ప్రయత్నం చేశాడు.
భారతి రాజా మాత్రం రజినీకాంత్ తమిళుడు ఎట్టి పరిస్థితుల్లో కాలేడు అంటూ తేల్చి చెబుతున్నాడు. ఎన్నికల సమయంలో భారతి రాజాకు మరికొందరు జత కలిస్తే మరింతగా రజినీకాంత్‌కు కష్టం తప్పదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.