బిగ్ బాస్ 3 ఫైన‌ల్ కంటెస్టెంట్ లిస్ట్ ఔట్..!

big boss 3 final contestant list out

వ‌ర్షాకాలంలో బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి హీట్ పుట్టించేందుకు బిగ్ బాస్ 3 సిద్ధ‌మైంది. నాగార్జున్ హోస్ట్‌గా జూలై 21 నుండి ప్రారంభం కానున్న ఈ రియాలిటీ షోటో కంటెస్టెంట్‌లుగా ఎవ‌రు పార్టిసిపేట్ చేయ‌బోతున్నార‌నేది ఇంకా సస్పెన్స్‌గానే మిగిలింది. మ‌న గాసిప్ రాయుళ్ళు మాత్రం రోజుకో లిస్ట్ విడుద‌ల చేస్తూ నెటిజ‌న్స్‌ని అయోమ‌యంలో ప‌డేస్తున్నారు. అయితే బిగ్ బాస్ 2 సీజ‌న్‌లో పార్టిసిపేట్ చేసి హౌజ్ అంతా హ‌డావిడి చేసిన నూత‌న్ నాయుడు తాజాగా 15 మంది లిస్ట్ అనౌన్స్ చేశాడు. వీరే బిగ్ బాస్ 3 కార్య‌క్ర‌మంలో పాల్గొనే ఫైన‌ల్ కంటెస్టెంట్స్ అంటూ ఒక వీడియో కూడా వదిలాడు.

ఎన్ఎన్ అనే పేరుతో సొంత యూ ట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన నూత‌న్ నాయుడు అందులో బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళ‌బోయే 15 మంది కంటెస్టెంట్స్ పేర్ల‌తో పాటు ఫోటోల‌ని రిలీజ్ చేశాడు. బిగ్ బాస్ హౌస్‌లో 100 రోజుల పాటు వీరు సంద‌డి చేయ‌నున్నార‌ని పేర్కొన్నాడు. మ‌రి వారిలో మొద‌ట‌గా నటి హేమ, 2. యాంకర్ శ్రీముఖి, 3. తీన్మార్ యాంకర్ సావిత్రి, 4. నటి హిమజా రెడ్డి, 5. వరుణ్ సందేశ్, వితికా షెరు (జంట), 7. సీరియల్ యాక్టర్ రవిక్రిష్ణ, 8. టీవీ యాక్టర్ అలీ రెజా, 9. టీవీ 9 జర్నలిస్ట్ జాఫర్, 10. పునర్వీ భూపాలం, 11. కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్, 12. సింగర్ రాహుల్, 13. యూట్యూబ్ స్టార్ మహేష్, 14. టీవీ నటి రోహిణి, 15. డస్మాష్ స్టార్ అషూ రెడ్డి .

వీరంద‌రు బిగ్ బాస్ హౌజ్‌లో ర‌చ్చ చేయ‌నున్నారంటూ నూతన్ నాయుడు జోస్యం చెప్పాడు. మ‌రి ఈ లిస్ట్ ఎంత వ‌ర‌కు కరెక్ట్ అనేది తెలియాలంటే రేప‌టి రాత్రి వ‌ర‌కు ఆగాల్సిందే. బిగ్ బాస్ 3 కార్య‌క్ర‌మం శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు, సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9.30 గంటలకు స్టార్ మాలో ప్ర‌సారం కానున్న సంగ‌తి తెలిసిందే.