ఏపీ స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చింది. 4 వారాల పాటు చంద్రబాబు నాయుడుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.కేవలం చంద్రబాబు ఆరోగ్య కారణాల దృష్ట్యా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నవంబర్ 24 వరకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
నవంబర్ 24న సరండర్ కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 10న మెయిన్ బెయిల్ పిటిషన్పై వాదనలు వింటామన్న కోర్టు… ఆస్పత్రి మినహా మరే ఇతర కార్యక్రమాల్లో పాల్గొన కూడదని షరతులు పెట్టింది. ఫోన్లో మాట్లాడకూడదంటూ హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మీడియా, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదన్న హై కోర్టు..నాలుగు వారాల పాటు చంద్రబాబు నాయుడు లొంగిపోవాలని కోరింది. ఇక ఇవాళ సాయంత్రం 5 – 7 గంటల మధ్య చంద్రబాబు విడుదల కానున్నారు.కాగా 52 రోజుల కిందట చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.