టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు భారీ రిలీఫ్ దొరికింది. ఏపీ స్టీల్ డెవలప్మెంట్ స్కాం లో భాగంగా చంద్రబాబు నాయుడుకు ఇవాళ బెయిల్ వచ్చింది. ఈ కేసులో చంద్రబాబు నాయుడుకు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
కేవలం నాలుగు వారాల పాటు మాత్రమే చంద్రబాబు నాయుడుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్యం కారణంగానే ఈ కేసులో చంద్రబాబు నాయుడుకు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబుకు వచ్చే నెల 24వ తేదీ వరకు కోర్టు బెయిల్ మంజురు చేసింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. కాగా 52 రోజుల కిందట చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.