టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు భారీ ఊరట లభించింది. తాజాగా చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు ఏపీ హైకోర్టు చేసింది. అంగళ్ళు కేసులో చంద్రబాబు నాయుడుకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
అయితే చంద్రబాబు నాయుడుకు లక్ష రూపాయల పూచికత్తుతో బెయిల్ ఇస్తున్నట్టు ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. కాగా ఇప్పటికే ఈ కేసులో 70 మందికి బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా, ఫైబర్ నెట్ కేసులో సిఐడి దాఖలు చేసిన పిటి వారంటును విజయవాడ ఏసిబి కోర్టు సమ్మతించింది. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5:00 లోపు వ్యక్తిగతంగా కోర్టులో హాజరు పరచాలని న్యాయాధికారి ఆదేశాలు జారీ చేశారు.