తాజాగా చంద్రబాబుపై మద్యం కేసుతో కలిపి ఇప్పటికీ ఐదు కేసులు నమోదయ్యాయి. స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్ నెట్ అంశాల్లో సిఐడి, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు ఘర్షణపై పోలీసులు కేసులు పెట్టారు. స్కిల్ కేసులో సిఐడి అధికారులు చంద్రబాబును సెప్టెంబర్ 9న అరెస్టు చేశారు. అప్పటినుంచి ఆయన రాజమండ్రి జైలులో ఉన్నారు.
ఆ FIRను కొట్టేయాలంటూ CBN వేసిన క్వాష్ పిటిషన్ పై SC తీర్పు వెలువరించాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా… ఇవాళ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో భాగంగా చంద్రబాబు నాయుడుకు బెయిల్ వచ్చింది. ఈ కేసులో చంద్రబాబు నాయుడుకు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది .కేవలం నాలుగు వారాల పాటు మాత్రమే చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. అనారోగ్యం కారణంగానే ఈ కేసులో చంద్రబాబు నాయుడుకు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. వచ్చే నెల 24వ తేదీ వరకు చంద్రబాబుకు కోర్టు బెయిల్ మంజురు చేసింది. తదుపరి విచారణ 4 వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.