Big Breaking News: చంద్రబాబుకు గుండె సమస్య !

AP Politics: Chandrababu's visit to Kuppam on 28th of this month
AP Politics: Chandrababu's visit to Kuppam on 28th of this month

స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయ్యి చంద్రబాబు గత రెండు నెలల క్రితం రిమాండ్ కు వెళ్లి ఇప్పుడు బెయిల్ మీద రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కోర్టులు ఏ విధమైన తీర్పులను ప్రకటించలేదని తెలిసిందే. కాగా ఈ రోజు జరిగిన కోర్ట్ విచారణలో చంద్రబాబు తరపున లాయర్లు ఆయన ఆరోగ్యానికి సంబంధించి కొన్ని వివరాలను సమర్పించారు. ఇటీవల చంద్రబాబు కుడికంటికి శాస్త్ర చికిత్స చేసిన సంగతి తెలిసిందే.. ఆ వివరాలను మరియు చంద్రబాబు గుండెకు సంబంధించిన కొత్త సమస్యను లాయర్లు కోర్ట్ దృష్టికి తీసుకెళ్లారు . లాయర్లు తెలిపిన సమాచారం ప్రకారం చంద్రబాబు గుండెకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నారని, గుండె పరిమాణం పెరిగిందని.. తద్వారా గుండెకు రక్తం సరఫరా చేసే రక్త నాళాల్లో సమస్యలు ఉన్నాయని తెలిపింది.

అందువలన చంద్రబాబుకు తగిన విశ్రాంతి అవసరం అని డాక్టర్లు సూచించారంటూ లాయర్లు కోర్టుకు తెలిపారు. ఈ విషయం తెలిసిన చంద్రబాబు అభిమానులు కంగారు మరియు బాధలో ఉన్నారు. దీనిపై హై కోర్ట్ ఏమని స్పందిస్తుంది అన్నది తెలియాల్సి ఉంది.