ఈ దసరా కానుకగా టాలీవుడ్ లో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ సినిమా లో నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా కాజల్ హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీలీల ముఖ్య పాత్రలో దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన భారీ మాస్ మసాలా ఎంటర్టైనర్ చిత్రం “భగవంత్ కేసరి”.
మరి బాలయ్య నుంచి వరుస హిట్స్ తర్వాత వచ్చిన ఈ చిత్రం తన కెరీర్ లో మరో మంచి ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా నిలవగా లేటెస్ట్ గా అయితే ఈ సినిమా గుంటూరు వసూళ్ళని అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ అధికారికంగా అనౌన్స్ చేసినట్టు తెలుస్తుంది. దీనితో మొదటి రోజే ఈ సినిమా అక్కడ భారీ మొత్తంలో ఏకంగా 3 కోట్ల 8 లక్షల 67 వేల 57 రూపాయలు వసూలు చేసినట్టుగా తెలిపారు.
ఈ వసూళ్లు హైర్స్ తో కలిపి కాగా ఈ సినిమా కి డే 1 లోనే ఇంత మొత్తం ఒక్క గుంటూరు నుంచే అంటే భారీ మొత్తం అని చెప్పాలి. మొత్తానికి అయితే వరుస హిట్స్ తో బాలయ్య మళ్ళీ తన సెన్సేషనల్ ఫామ్ లో దూసుకెళ్తున్నారు అని మనం చెప్పాలి.