Election Updates: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన చెరుకు

Election Updates: Cheruku resigns from Congress party
Election Updates: Cheruku resigns from Congress party

కాంగ్రెస్ పార్టీకి మరోషాక్‌ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి చెరుకు సుధాకర్ రాజీనామా చేశారు. ఈ మేరకు లేఖ విడుదల చేశారు చెరుకు సుధాకర్. నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరు వల్లే పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు చెరకు సుధాకర్. అంతేకాదు.. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు చెరకు సుధాకర్. సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలోనే.. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో చెరకు సుధాకర్ చేరనున్నారు.

ఇక అటు బీఆర్ఎస్ పార్టీలో చేరారు అంబర్‌పేట శంకర్. మంత్రి హరీశ్ రావు సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు అంబర్‌పేట శంకర్. ఇక అటు మంత్రి హరీశ్ రావు సమక్షంలో గులాబీ పార్టీలో ఉప్పల్ సర్కిల్ మాజీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ముశనం శ్రీనివాస్, మహిళా కాంగ్రెస్ తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఎ కల్పనారెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు చేరారు. ఇది ఇలా ఉండగా.. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కీలక నేతలు పార్టీలు మారుతున్నారు.