Election Updates: మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ప్రతీ నెల రూ.2,500 కల్పిస్తాం: రాహుల్ గాంధీ

Election Updates: We will provide Rs 2,500 to women every month through Mahalakshmi scheme: Rahul Gandhi
Election Updates: We will provide Rs 2,500 to women every month through Mahalakshmi scheme: Rahul Gandhi

నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ లో కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ లో రాహుల్ గాంధీ మాట్లాడారు. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ ఇప్పుడు రూ.1000 ఉన్నది.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ.500కే అందజేస్తామని తెలిపారు. అదేవిధంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. తప్పుడు మాటలు చెప్పడానికి నేను రాలేదు. దళితుడిని సీఎం చేస్తానని.. దళితులకు మూడు ఎకరాల భూమి ఇష్తానని మిమ్మల్ని నేను మోసం చేయలేదు. రూ.15లక్షలు మీ బ్యాంకు ఖాతాలో వేస్తానని మీ దగ్గరికి రాలేదని తెలిపారు.

రైతు భరోసా కింద ఎకరానికి రూ.15వేలు ఇస్తామని.. రైతు కూలీలకు ఏడాదికి రూ.12వేలు కల్పిస్తామని తెలిపారు. దొరల తెలంగాణ ఇవ్వలేదు.. ప్రజా తెలంగాణ ఇచ్చామని తెలిపారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ మాట తప్పలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో తెలంగాణ, కర్ణాటక, చతీష్ ఘడ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం. పసుపు క్వింటాల్ కు రూ.12 వేల నుంచి 15వరకు మద్దతు ధర కల్పిస్తామని పేర్కొన్నారు రాహుల్ గాంధీ. మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ప్రతీ నెల రూ.2,500 కల్పిస్తామని హామీ ఇఛ్చారు. షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తామని హామీ ఇచ్చారు.