మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై ఉట్నూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన FIRను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ మహిళా నేత ఫిర్యాదుతో గతంలో కేటీఆర్‌పై ఉట్నూరు పీఎస్‌లో కేసు నమోదైంది. కేటీఆర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని కంప్లైంట్‌లో పేర్కొన్నారు. దీంతో గత ఏడాది సెప్టెంబర్ 30వ తేదీన ఉట్నూరు పోలీసులు కేటీఆర్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
