రాజీవ్ యువ వికాసం స్కీమ్‌లో సిబిల్ స్కోర్ కీలకం కానుంది. పథకం ద్వారా ప్రభుత్వ సహాయంతో లోన్ పొందాలనుకునే యువతకు క్రెడిట్ స్కోర్‌ను ప్రధాన అర్హతగా నిర్ణయించనున్నారు. దరఖాస్తుదారుల సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే లేదా గతంలో రుణాలు తీసుకుని చెల్లించకపోతే వారి దరఖాస్తులను బ్యాంకులు తిరస్కరించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. లోన్ అప్లికేషన్‌కు ముందు సిబిల్ స్కోర్‌ను తప్పనిసరిగా పరిశీలించనున్న బ్యాంకులు, దానికి సంబంధించి ఫీజు కూడా వసూలు చేయనున్నాయి. ప్రతి అప్లికేషన్‌కి రూ.100 నుంచి రూ.200 వరకు వసూలు చేసే యోచనలో కొన్ని బ్యాంకులు ఉన్నట్లు సమాచారం.