యూట్యూబ్ అండ్ బిగ్ బాస్ ఫేమ్ షణ్ముక్ జస్వంత్ కోసం అందరికీ తెలిసిందే. తాను ఆన్ స్క్రీన్ పై ఎంత మంచి ఫేమ్ తెచ్చుకున్నాడో ఆఫ్ స్క్రీన్ విషయంలో మాత్రం తన విషయంలో పలు మార్లు కాంట్రవర్సీ లు కూడా కనిపించాయి. ఇక నిన్ననే షాకింగ్ గా ఒక డ్రగ్స్ కేసులో తాను ఇరుక్కోవడం ఎప్పుడు వైరల్ గా మారింది. అయితే ఇప్పుడు ఈ కేసు విషయంలో ట్విస్ట్ తెలుస్తోంది.
షణ్ముక్ కు పోలీసులు ఏ కారణం చేత అయితే అదుపులోకి తీసుకున్నారో అందుకు సరైన ఆధారాలు లేవని అతని తరపు న్యాయవాది లు తెలుపుతున్నారు. అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు కానీ తన తల్లిదండ్రుల మాటల ప్రకారం షణ్ముక్ జస్వంత్ ఎలాంటి మాదకద్రవ్యాలు తీసుకోలేదని బయట సర్క్యులేట్ అవుతున్న వార్తల్లో నిజం లేదని తెలియచేసారు .
అలాగే తన అన్నయ్య విషయంలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు షణ్ముక్ సరిగ్గా సమాధానాలు ఇవ్వకపోవడం మూలానే అతన్ని అదుపులోకి తీసుకున్నారని అయితే తాను మాదకద్రవ్యాలు తీసుకున్నాడా లేదా అనేది పూర్తి ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలుస్తుంది అని వివరణ ఇచ్చారు. మరి ఈ కేసు విషయంలో ఏమవుతుందో అనేది చూడాలి.