నష్టాల్లో బిగ్ బాస్కెట్

నష్టాల్లో బిగ్ బాస్కెట్

బిగ్‌ బాస్కెట్‌నే కాకుండా సూపర్‌మార్కెట్‌ గ్రోసరీ సప్లైస్‌ పేరుతో హోల్‌సేల్‌  విభాగాన్ని కూడా ఇన్నోవేటివ్‌ రిటైల్‌ కాన్సెప్ట్స్ సంస్థ నిర్వహిస్తోంది. ఇన్నోవేటివ్ రిటైల్ కాన్సెప్ట్స్ (బిగ్‌బాస్కెట్) 2018-19 ఆర్థిక సంవత్సరంలో నష్టం 348.27కోట్లకు పెరిగింది. అయితే రెగ్యులేటరీ పత్రాల ప్రకారం ఆదాయం గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 69 శాతం పెరిగి 2380.95 కోట్లకు చేరుకుంది.

2017-18 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 179.23కోట్ల నష్టాన్ని నమోదు చేసిందని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు దాఖలు చేసిన పత్రాలు మరియు బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫాం టోఫ్లర్ ఆధారాలు చూపించాయి. పోయిన ఆర్థిక సంవత్సరంలో 1409.61 కోట్ల నుంచి 2018-19లో కార్యకలాపాల నుంచి ఆదాయం 68.9 శాతం పెరిగి 2380.95 కోట్లకు నమోదైందని కంపెనీ తెలిపింది.