తెలుగు బిగ్‌బాస్ సీజన్ 2కు మొదటి నుండి కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ వస్తున్న పిట్ట దీప్తి సునయన నిన్నటి ఎపిసోడ్‌లో ఎలిమినేట్ అయ్యింది. సోషల్ మీడియా స్టార్‌గా తనకంటూ ఒక గుర్తింపును దక్కించుకుని, సెలబ్రెటీ స్టేటస్‌తో బిగ్‌బాస్ రెండవ సీజన్‌లో ఎంట్రీ దక్కించుకున్న వెళ్లిన దీప్తి సునయన ఎలిమినేట్ అవ్వడం ఆమె అభిమానులను తీవ్రంగా నిరాశ పర్చుతుంది. ఆమె ఎలిమినేట్ అవ్వడంను ఆమె అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.సోషల్ మీడియా సంచలనం అయిన దీప్తి సునయనకు ఈసారి కూడా మంచి ఓట్లు వస్తాయని అంతా ఆశించారు. పూజా రామచంద్రన్ మరియు దీప్తి సునయనలు ఎలిమినేషన్ నామినేషన్‌లో ఉన్నారు కనుక ఖచ్చితంగా ఇద్దరిలో పెద్దగా గుర్తింపు లేని పూజా రామచంద్రన్ వెళ్లి పోతుందని భావించారు. కాని అనూహ్యంగా కౌశల్ ఆర్మీ దీప్తి సునయనను టార్గెట్ చేసినట్లుగా అనిపిస్తుంది.
దీప్తి సునయన గేమ్స్‌లో మరియు టాస్క్‌ల్లో పార్టిసిపెంట్ చేయకపోయినా కూడా ఆమె ఇంట్లో ఉండాలని ఎంతో మంది కోరుకున్నారు. ఆమె ఇంట్లో ఉంటే చాలా క్యూట్‌గా అనిపిస్తుందని, ఆమె క్యూట్ మాటలు, ఆమె చేసే డాన్స్, ఆమె ఎక్స్‌ప్రెషన్స్ అన్నింటికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అలాంటి దీప్తి సునయన వెళ్లిపోవడం వల్ల ఇంట్లో ఖచ్చితంగా సందడి తగ్గుతుంది అంటూ బిగ్‌బాస్ షోను రెగ్యులర్‌గా ఫాలో అవుతున్న వారు చెబుతున్నారు. దీప్తి సునయన ఎలిమినేషన్‌కు రాజకీయం ఏదైనా నడిచిందా అనే అనుమానాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వ్యక్తం అవుతున్నాయి.దీప్తి సునయన అక్క సుష్మ పెళ్లి త్వరలో జరుగబోతుంది. కుటుంబ సభ్యుల నుండి రిక్వెస్ట్ రావడం వల్ల దీప్తి సునయనను బిగ్‌బాస్ నిర్వాహకులు బయటకు పంపి ఉంటారా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి పూజా కంటే ఖచ్చితంగా మంచి క్రేజ్ ఉన్న దీప్తి సునయన ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వడంతో అనుమానాలు పెరుగుతున్నాయి.