బుల్లితెరపై బిగ్‌బాస్ రియాల్టీ షోకి ఉన్న క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిందీ, తమిళ్, తెలుగు అనే తేడా లేకుండా అన్ని భాషల్లోనూ ఈ బిగ్ రియాల్టీ షోకి ఫ్యాన్స్ ఉన్నారు. ఇక తెలుగులో అయితే సీజన్, సీజన్‌కి బిగ్‌బాస్ ప్రేక్షకులు పెరిగిపోతున్నారు. టీఆర్పీ రేటింగ్‌లో రికార్డులు బద్దలుకొడుతోంది. గత నాలుగు సీజన్స్ విజయవంతం కావడంతో ఐదో సీజన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు నిర్మాహకులు. త్వరలోనే ఐదో సీజన్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఇప్పటికే సెట్ నిర్మాణం, కంటెస్టెంట్ల ఎంపిక తుది దశకు చేరుకున్నాయి.
ఇదిలా ఉంటే, ప్రతి సీజన్ మాదిరే ఈ సారి కూడా కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే అంటూ కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ లిస్ట్‌లో యాంకర్ వర్ణిణి, యాంకర్ రవి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి, బుల్లితెర నటి నవ్యస్వామి, యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్, హీరోయిన్ ఈషా చావ్లా, యాంకర్ శివ, శేఖర్ మాస్టర్, లోబో, సింగర్ మంగ్లీ, యాంకర్ ప్రత్యూష, టిక్‌టాక్ స్టార్ దుర్గారావు, బుల్లితెర నటులు సిద్ధార్థ్ వర్మ- విష్ణు ప్రియ జంటల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ లిస్ట్‌లో ఉన్న వారిలో ఎవరెవరు హౌస్‌లోకి వస్తారో లేదో తెలీదు కానీ ,ఈ సీజన్‌లో గ్లామర్ డోస్ మాత్రం కాస్త గట్టిగానే ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ సీజన్‌కు కూడా నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది.