‘కార్తీకదీపం’ భాగ్యగా ఎంతగానో ఫేమస్ అయిన ఉమాదేవి ఈమధ్యే బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో ఎంట్రీ ఇచ్చింది. ఉన్నది రెండువారాలే అయినా హౌస్‌లో ఒక్కొక్కరినీ గడగడలాడించి అందరినీ ఠారెత్తించింది. నామినేషన్స్ వస్తే చాలు పూనకం వచ్చినట్లు ఊగిపోయేది. మాటకు మాట దెబ్బకు దెబ్బ అన్నట్లుగా ప్రవర్తించేది! దాదాపు కంటెస్టెంట్లు అందరితో గొడవపడి బిగ్‌బాస్ షోలో గయ్యాళి గంపగా పేరు తెచ్చుకున్న ఉమాదేవి తాజాగా ఓ గొప్ప నిర్ణయం తీసుకుంది. తన రెమ్యునరేషన్‌ను ఓమంచి పని కోసం వినియోగించింది.
బిగ్‌బాస్ ద్వారా తనకు వచ్చిన పారితోషికంలోని కొంత మొత్తాన్ని బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారిని ఆదుకునేందుకు అందించింది. ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఉమా మంచి మనసును మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఆమె గొంతే కాదు, మనసు కూడా పెద్దదే అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. చిన్నారికి ప్రాణం పోసిన ఉమాదేవికి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నారు. ఆమె వెళ్లిపోయాక షోలో పస లేకుండా పోయిందని, అంతా నసే ఉందని, వీలైనంత త్వరగా ఉమాదేవి రీఎంట్రీ ఇస్తే బాగుండని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మరికొందరు.