బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ఇప్పుడిప్పుడే రంజుగా మారుతోంది. వారియర్స్, చాలెంజర్స్ అంటూ కంటెస్టెంట్ల మధ్య చిచ్చుపెట్టిన బిగ్‌బాస్ ఆ అడ్డుగోడను తొలగించేశాడు. దీంతో హౌస్మేట్స్ గొడవలు మాని కొంత కూల్ అయ్యారు. అలాగే బిగ్‌బాస్ రూల్స్‌ను కూడా పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. చాలామంది పగటిపూట నిద్రించకూడదన్న రూల్ బ్రేక్ చేశారు. కొందరు పాత కంటెస్టెంట్లు మైక్ పెట్టుకోవడం కూడా మర్చిపోతున్నారు. దీంతో సీరియస్ అయిన బిగ్‌బాస్ వారు చేసిన తప్పులను వీడియో వేసి చూపించాడు.
హౌస్మేట్స్ చేసిన తప్పుకు కెప్టెన్ అనిల్‌కు శిక్ష విధించాడు. అతడి కెప్టెన్సీ అర్ధాంతరంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు. వెంటనే తను ధరించిన కెప్టెన్సీ బ్యాడ్జ్‌ను స్టోర్‌రూమ్‌లో పెట్టాలని ఆదేశించాడు. ఈ మేరకు ప్రోమో రిలీజైంది. ఇది చూసిన నెటిజన్లు అనిల్ రాథోడ్‌ను చూసి జాలి పడుతున్నారు. అప్పుడు మోడల్ జెస్సీ కెప్టెన్సీని నాశనం చేస్తే ఇప్పుడు మోడల్ అనిల్ రాథోడ్ కెప్టెన్సీని భ్రష్టు పట్టించారని కామెంట్లు చేస్తున్నారు. మరి నిజంగానే బిగ్‌బాస్ అనిల్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించాడా? లేదంటే సీరియస్ వార్నింగ్ ఇచ్చి వదిలేశాడా? అన్నది నేటి ఎపిసోడ్లో తేలనుంది.