ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభమైంది. హోస్ట్ నాగార్జున ‘టన్నుల కొద్దీ కిక్’ అంటూ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. భారీ అంచనాల నడుమ ఈ షో నేటి (సెప్టెంబర్ 05) సాయత్రం 6 గంటలకు స్టార్ మా ఛానల్లో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. జిల్ జిగేమ్ అనిపించేలా ఉన్న బిగ్ బాస్ స్టేజ్ కనువిందు చేసింది. బోరింగ్ ఉండదనే కాన్సెప్ట్ థీమ్ ఆకట్టుకుంది.మిస్టర్ మజ్ను సాంగ్‌తో అందగత్తెలతో ఆడిపాడుతూ ఎంట్రీ ఇచ్చారు నాగార్జున. అందగత్తెలతో ఆడుపాడుతూ స్టేజ్‌ని షేక్ చేశారు నాగార్జున.
స్టేజ్ మీదికి నాగార్జునని ఆహ్వానిస్తూ గ్రాండ్ వెల్కమ్ చెపారు బిగ్ బాస్.చాలా రోజుల తరువాత బిగ్ బాస్ వాయిస్ వినడం హ్యాపీగా ఉందంటూ.. అభిమానులకు ప్రామిస్ చేశారు నాగార్జున. సీజన్ 5.. ఐదొంతుల ఎక్కువ ఎంటర్ టైన్ చేస్తుందని అన్నారు.ఆ తరువాత మాస్, క్లాస్, రొమాన్స్ సాంగ్స్‌కి బిగ్ బాస్ కోరికపై డాన్స్ చేశారు నాగార్జునపంచేంద్రియాలు, పంచభూతాలు, పంచ ప్రాణాలు అంటూ బిగ్ బాస్ ఐదో సీజన్ గురించి బాగానే ప్రమోషన్ చేశారు నాగ్.
ఇంద్రుడికి వెయ్యి కళ్లు.. బిగ్ బాస్ 70కి కళ్లు.. కెమెరాలున్నాయి.లవ్లీ లాంజ్, చిల్ ఫుల్ అంటూ ఎటో వెళ్లిపోయింది మనసు అంటూ నాగ్ గతంలోకి వెళ్లిపోయారు. పిల్లగాలు, ఆడపిల్లల గాలులు అంటూ తన స్టైల్లో కౌంటర్లు వేశారు.కిక్కు టన్నుల కొద్ది వస్తుందని నాగ్ బిగ్ బాస్ ఇంటిని పరిచయం చేస్తూ వచ్చారు. వాష్ రూం గురించి చెబుతూ అమ్మాయిలు గంట సేపు అద్దం ముందు ఉంటారట.అబ్బాయిలు.. ఇక అమ్మాయిలు ఎక్కడుంటే అక్కడే ఉంటారని మన్మథుడి పాటకు స్టెప్పులు వేసేశారు.మోజ్ రూం అంటూ అందులో కంటెస్టెంట్లు మస్తీ చేస్తారు అని నాగ్ తెలిపారు.
సోఫాలను చూపిస్తూ నాగ్ అక్కడికి కింగ్ సినిమాలోని కామెడీని ప్లే చేసేశారు. కిచెన్‌లోకి నాగ్ ఎంట్రీ ఇవ్వడంతోనే శివ సినిమాను గుర్తు చేశారు. సరసాలు చాలు శ్రీవారు అనడంతో నాగ్ అమల ఊహల్లోకి వెళ్లినట్టున్నారు.పవర్ రూం అంటూ కొత్త దాన్ని పరిచయం చేశారు. పవర్ వస్తే.. బాధ్యతలు కూడా వస్తాయి.. దాన్ని సక్రమంగా వాడాల్సి ఉంటుందని నాగ్ హింట్ ఇచ్చారు. బెడ్రూంను చూపిస్తూ.. రెండు బెడ్లను లాక్ చేయడంతో ట్విస్ట్ ఉండబోతోందని నాగ్ చెప్పేశారు. కన్ఫెషన్ రూంలోకి నాగ్ ఎంట్రీ ఇవ్వడంతో.. బిగ్ బాస్ పలకరించేశారు. బిగ్ బాస్ ఇళ్లు ఎలా అనిపించింది అని అడగడంతో 5మచ్ అంటూ ఐదో సీజన్ గురించి ప్రమోషన్ చేసేశారు.
రెండు బెడ్లను లాక్ చేయడంపై నాగ్ ప్రశ్నించడం.. సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తుందని బిగ్ బాస్ అనేశారు.మొత్తంగా 19 కంటెస్టెంట్స్ హౌస్‌లోకి అడుగుపెట్టడంతో బిగ్ బాస్ హౌస్ కళకళలాడింది. ఆ తరువాత ఈ 19 మందితో ఓ సరదా గేమ్ ఆడించారు నాగార్జున. సింగిల్ బెడ్ కోసం జరిపిన ఈ టాస్క్‌లో ప్రియాంక, విశ్వ, మానస్, వీజే సన్నీలు పోటీ దారులుగా నిలవడంతో ఈ నలుగురికి నాలుగు బాక్స్‌లు అందించారు. అయితే ఇందులో విశ్వకి బెడ్ కీ ఉండటంతో విశ్వ విజేతగా నిలిచి సింగిల్ బెడ్ని సొంతం చేసుకున్నాడు.వందరోజులకు పైగా వినోదాన్ని పండించడానికి బిగ్ బాస్ హౌస్ వేదికగా మారింది.
గత సీజన్ గ్రాండ్ ఫైనల్.. భారతదేశంలో మరే రియాల్టీ షో కూడా సాధించలేనట్టి రీతిలో అత్యధిక వీక్షణ రేటింగ్‌ను సాధించి రికార్డులను సృష్టించింది. ఆ రికార్డులను తిరగరాసే రీతిలో ఈ సారి బిగ్‌బాస్ షో ఉండబోతుందని ధీమా వ్యక్తం చేస్తోంది స్టార్ మా.అంతర్జాతీయంగా అత్యంత విజయవంతమైన నాన్ ఫిక్షన్ ఫార్మాట్లలో బిగ్ బాస్ ఒకటి. భారతదేశంలో ఏడు భాషలలో 37 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో ఎండెమోల్షైన్ గ్రూప్ సొంతం. ఎంత హంగామా చేసినా.. ఆట రంజుగా సాగాలన్నా వినోదం పండాలన్నా అందులోని ప్లేయర్స్‌దే కీ రోల్.. కాబట్టి ఈ సీజన్లో ఎంత వరకూ రంజింపజేస్తారో చూద్దాం.