కెసిఆర్ గారి నాయకత్వం లో మర్రి రాజశేఖర్ రెడ్డి గారి చేస్తున్న కృషిపై పుట్టిన రోజు పాట

మర్రి రాజశేఖర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ టాలీవుడ్ మోహన భోగరాజు పాడిన ఈ పాట కార్తీక్ కొడకాండ్ల సంగీతం సమకూర్చారు, గడ్డం వీరు అందించిన సాహిత్యం అద్భుతంగా పొదిగింది, ఇంతటి సందేశాత్మక నైన ఈ పాటను సందీప్ గౌడ్ మేడ్చల్ పట్టణ మాజీ అధ్యక్షుడు అందించినారు.

ఈ వీడియో పాట యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఊర్రుతలుగిస్తుంది ..

ఊరు బాగుంటేనే మనం బాగుంటాం అని నమ్మడమే కాదు అహర్నిశలు తన చుట్టూ ఉన్నవారి బాగోగుల కోసం తపించే మనసున్న మనిషి మర్రి రాజశేఖరరెడ్డి, టిఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ నియేజకవర్గ ఇంచార్జిగానే కాక ఉన్నతవిద్యావేత్తగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ప్రతిఒక్కరికి సుపరిచితుడు ఎంఆర్ఆర్, లక్షలార్జించే అవకాశం ఉన్నా… స్థానిక మంత్రి ప్రియనేత మల్లారెడ్డిగారి అడుగుజాడల్లో బడుగుల జీవితాల్లో వెలుగులు పూయించడానికి ప్రజాక్షేత్రంలో సేవకోసం తరలివచ్చిన త్యాగశీలి ఎంఆర్ఆర్. సాగు,తాగునీరు కోసం అహర్నిషలు క్రుషిచేస్తున్న అపర భగీరథుడు మన సీఎం కేసీఆర్ గారి స్పూర్తితో కాళేశ్వరం ప్రాజెక్ట్ను గుమ్మడిదాల ఎత్తిపోతల పథకం ద్వారా మేడ్చల్, నర్సాపూర్, గజ్వెల్, మరియు పఠాన్ చెరు అసెంబ్లీ పరిధిలో గల 25000 ఎకరాలకు సాగు మరియు త్రాగునీరు అందించడం కోసం కృషి చేస్తున్నారు మర్రిరాజశేఖరరెడ్డి.

ఇటు నీటిపారుదలతో పాటు అటు మన రాష్ట్రంలోని చిన్నసూక్ష్మ, మధ్యతరగతి పరిశ్రమల అభివృద్ధి కొరకు MSME’s & CITD సంస్థల భాగస్వామ్యాన్ని కోరుతూ అనేక ప్రతిపాదనలు పంపుతున్నారు. గెలుపుఓటములని పట్టించుకోకుండా తెలంగాణ రాష్ట్రం కోసం కేంద్రం కేటాయించిన నిధులను వివిధ ప్రాజెక్ట్ ల ద్వారా తీసుకురావడం కోసం వివిధ శాఖలతో సంప్రదింపులు జరిపి వాటిని రిలీజ్ చేయడానికి ఒత్తిడి తీసుకొస్తున్నారు.

మేడ్చల్ లాంటి గ్రామీణ నేపథ్యం ఉన్న జిల్లాల్లోని మహిళల అభ్యున్నతికి, ఆర్ధిక పురోగతిని సాధించడానికి నిత్యం వారి కుటీర పరిశ్రమలను సందర్శిస్తూ వారిలో స్ఫూర్తిని నింపడమే కాక తన ఎంఎల్ఆర్ విద్య సంస్థల ద్వారా వారిని అత్యుత్తమ మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు అందుకోసం బ్యాంకర్లని వీరితో అనుసందానం చేసి అవసరమైన ఆర్థిక చేయూతని అందిస్తున్నారు. మరోవైపు పూటగడవడమే గగనమైపోతున్న చేనేత కార్మికులని మరియు చేతి వృత్తుల వారిని చైతన్య పరుస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన పథకాలలో వారిని పెద్దఎత్తున లబ్దీదారులని చేయడమే కాక వారి స్వావలంభన కోసం అనుక్షణం ఆలోచిస్తున్న మనసున్న మనిషి ఎంఆర్ఆర్.

సమాజం బాగుపడాలంటే సంపూర్ణవిద్యతోనే సాద్యమని నమ్మిన వ్యక్తి మర్రి రాజశేఖర్ రెడ్డి. అందుకోసం తన సంస్థల ద్వారానే కాకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా ఉండాలనే ఆశయ సాధనకి పూనుకొని తన స్వంత ఖర్చులతో మేడ్చల్ జిల్లాలోని దాదాపు 5,500 విద్యార్థులకు పైగా స్టూడెంట్ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ని తయారుచేయించారు. ఇందుకోసం అత్యున్నతమైన వైద్య సదుపాయాలతో వారికి అన్నిరకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ప్రతి ఒక్క విద్యార్థి ఆరోగ్య వివరాల్ని డిజటలైజ్ చేసే కార్యక్రమం విజయవంతం గా పూర్తి చేశారు. రాష్ట్రంలో వెదురు ద్వారా సంపద సృష్టించి తద్వారా రాబోయే కాలంలో కలప కి ప్రత్యామ్నాయంగా వెదురు ద్వారా ఎందరికో ఉపాధి కల్పించవచ్చు అని ముందుచూపుతో రాష్ట్రంలో వెదురు కార్పోరేషన్ ఏర్పాటు చేయాలనే సంకల్పం తీసుకున్న వ్యక్తి మన ఎంఆర్ఆర్. నిరంతరం సాగే ఈ సామాజిక కార్యక్రమాలకు తోడు అనుకోని విపత్తులా మానవాళిపై విరుచుకు పడిన కరోనా భూతాన్ని తరిమేయడానికి తనవంతు సేవని నిర్విరామంగా నిర్వహిస్తున్నాడు మర్రి రాజశేఖరరెడ్డి. ఇప్పటివరకూ కోవిడ్ 19 విపత్తు నిర్వహణ కోసం ముప్పైలక్షలు తను స్వయం గా ఇవ్వడంతో పాటు మరి కొంత మంది దాతలని స్వయంగా సంప్రదించి దాదపు కోటి రూపాయలకి పైగా సహకారాన్ని ప్రభుత్వ సహాయ నిధికి అందచేసారు.

ఈ విపత్కర సమయంలో ప్రాణాలకి తెగించి మనకోసం ముందుండి పోరాడుతున్న పారిశుద్ధ్య కార్మికుల కొరకు PPE కిట్ట్లను, మస్కులు, మరియు సానిటైజర్లను విరివిగా పంపిణీ చేశారు. తన ఎంఎల్ఆర్ విద్యా సంస్థల ద్వారా 3D మాస్కులను మరియు UV సానిటీజర్ యంత్రాలను ప్రభుత్వానికి అందించారు. దాదాపుగా 22 రోజుల పాటు వలస కార్మికుల కొరకు మధ్యాహ్న భోజనాన్నీ రోజుకు 2000 మందికి సరిపడా అందించారు. అంతేకాకుండా సోంతవారిని చూడాలనుకుంటున్న వారి తాపత్రయాన్ని తీర్చడం కోసం తమ సంస్థ ద్వారా అనేక బస్ లను ఏర్పాటు చేసి వారి స్వస్థలాలకు చేరెలా పూనుకున్నారు. దాదాపుగా మేడ్చల్ పరిధిలో గల అన్ని మున్సిపాలిటీ లలో తనేకాక అనేక మంది దాతల సహకారంతో బియ్యం, నిత్యావసర సరుకులు మరియు కూరగాయలు పంపిణీ చేశారు. కష్ట కాలంలో ఇబ్బందులు పడుతున్న అనాథ ఆశ్రమలను మరియు వృద్ధ ఆశ్రమలను ఆదుకోవాలనే సంకల్పంతో 11 ఆశ్రమాలకు 2 నెలలకు సరిపడా బియ్యం నిత్యావసర సరుకులు అందచేసారు.

వీరితో పాటు సమాజంకోసం క్రుషిచేస్తున్న జర్నలిస్టుల పరిస్థితులు అర్థం చేసుకొని వారిని కూడా ఆదుకోవాలని 500 పాత్రికేయమిత్రులకు 25 కిలోల బియ్యం నెలకు సరిపడా నిత్యావసర సరుకులని అందచేశారు. మరోవైపు పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ఐదువేల మందికి పైగా నిరుపేద ముస్లీం సోదరులకి రంజాన్ కిట్లను అందించారు. సర్వమతాల్ని సమద్రుష్టితో చూస్తూ క్రెస్తవ మత పెద్దలకు మరియు సోదరులకు సైతం కరోనా కల్లోల కాలంలో నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. అనునిత్యము పేద ప్రజల కోసం తనప్రాంగణాలలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అవసరమైన సహాయం చేయడమే కాదు. ఈ విషమకాలంలో ప్రజలకి సేవలందించిన పోలీస్ ,వైద్య మరియు పారిశుద్ధ్య సిబ్బంది మనోధైర్యం పెంచేలా వారిలో ఆత్మవిశ్వాసం తోణికిసలాడేవిదంగా ఘన సత్కారం నిర్వహించారు మన మర్రి రాజశేఖర్ రెడ్డి. అన్నా అంటే నేనున్నా అనే మంచి మనషున్న మన అన్న పుట్టినరోజంటే మనందరికీ ఒక పండగ రోజే… సాయంకోరి వచ్చే వాల్లలో తన పర తారతమ్యాలని చూడని అందరినీ సమభావంతో ఆదరించే ఎంఆర్ఆర్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని మన:స్పూర్తిగా కోరుకుంటూ హ్యపీ బర్త్డే మర్రి రాజశేఖరరెడ్డి.