బీజేపీకి తెలంగాణలో అనుకూలం.. మా గ్రాఫ్ పెరిగింది: బండి సంజయ్

BJP is favorable in Telangana.. Our graph has increased: Bandi Sanjay
BJP is favorable in Telangana.. Our graph has increased: Bandi Sanjay

ఆదిలాబాద్ వేదికగా అమిత్ షా బహిరంగ సభకు విపరీతమైన స్పందన వచ్చిందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బిజెపికి అనుకూల వాతావరణం ఉన్నదని తెలిపారు.కొందరు మా గ్రాఫు తగ్గినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మేము రాజకీయంగా కొట్లాడుతాం అంతే కాని కెసిఆర్ బాగుండాలని కోరారు. నిజాంకు వ్యతిరేకంగా వచ్చే రజాకా సినిమా అంటే మీకు భయం ఎందుకు అని ప్రశ్నించారు. మీరు నిజాం రజాకార్ల వారసులా ఎంఐఎంఓ బాధపడుతుందని మీరెందుకు భయపడుతున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు.

కేంద్ర సహకారం లేకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ ఎలా అభివృద్ధి చేస్తుందన్నారు. కరీంనగర్ లో పోటీ చేయాలని నాకు కోరికగా ఉందని చెప్తాను. మా అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేస్తానని బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు. బిజెపి కారు స్టీరింగ్ ఎంఐఎం చేతుల్లో ఉందన్న అమిత్ షా కామెంట్స్ వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మీరిద్దరూ ఒకటి కాకపోతే ఎంఐ ఎముకు దమ్ముంటే.. మీరు నిజంగా అల్లాని ప్రార్థిస్తే హైదరాబాద్ దాటి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఓల్డ్ సిటీని న్యూ సిటీగా ఎందుకు మార్చడం లేదన్నది చెప్పాలన్నారు. ఎంఐఎం అడ్డగా చెప్పుకున్న భాగ్యలక్ష్మి గుడి దగ్గరకు అన్ని పార్టీలను రప్పించిన ఘనత మాదే అన్నారు. చివరికి ఎంఐఎం నేతలు కూడా భాగ్యలక్ష్మి ఆలయం పేరు కల్వరిస్తున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. గ్రామాల్లో పేద ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. పండించిన ప్రతి గింజలు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు.