జనసేన పార్టీకి మరో షాక్‌..కీలక నేత రాజీనామా..

Another shock to the Janasena party..Key leader resigns..
Another shock to the Janasena party..Key leader resigns..

వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న జనసేన పార్టీకి మరో షాక్‌ తగిలింది. తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటించిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, నాల్గో విడత వారాహి విజయయాత్రను కృష్ణా జిల్లాలో విజయవంతం చేశారు.. అయితే, వరుస రాజీనామాలు ఆ పార్టీకి ఇబ్బందిగా మారాయి..తాజాగా పిఠాపురం మాజీ ఇంఛార్జి మాకినీడి శేషు కుమారి జనసేన పార్టీకి రాజీనామా చేశారు. జనసేనలో సీనియర్‌ నేతగా ఉన్న ఆమె. 2014 ఎన్నికల్లో జనసేన తరుపున పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయితే, మూడు నెలల క్రితం జనసేన పార్టీ అధిష్టానం పిఠాపురం ఇంఛార్జి బాధ్య తల నుంచి తప్పించింది. దీంతో మనస్థాపానికి గురైన మాకినీడి శేషుకుమారి ఇప్పుడు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు..

అయితే, ఆమె ఏ పార్టీలో చేరతారు అనే విషయాలు తెలియాల్సి ఉంది. కాగా, రాష్ట్ర అభివృద్ధికై జనసేనకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ జనసేన చేపట్టిన కార్యక్రమంలోనూ చురుగా పాల్గొన్నారు శేషుకుమారి.. సమస్యల పరిష్కారానికై పవనన్నకు ఓటు వేసి జనసేనకు ఒక్క అవకాశం ఇవ్వలని కోరారు. వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా అందరూ గాజు గ్లాసుకి ఓటు వేయాలని కోరారు.