నేనంటే నేనే ‘సీఎం’..కాంగ్రెస్ లో తలనొప్పి ఇదే.!

Election Updates: Congress second list released
Election Updates: Congress second list released

తెలంగాణలో గత రెండు ఎన్నికలలో ప్రతిపక్షం లేదని, ఉన్నా లేనట్లేనని అందరికీ తెలిసిందే. రెండు ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్‌కు ఏ పార్టీ పోటీ నిలవలేకపోయింది. కాంగ్రెస్ కొన్ని స్థానాల్లో గెలిచిన తర్వాత..ఎమ్మెల్యేలు బి‌ఆర్‌ఎస్ లోకి జంప్ అయిపోయారు. అయితే ఈ సారి మాత్రం అలాంటి పరిస్తితి ఉండదు. గట్టి పోటీనే ఉంటుంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ రావడంతో ప్రధాన పార్టీలైన బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ ఎన్నికల బరిలో హోరాహోరీగా పోటీ పడనున్నాయి.

రెండుసార్లు గెలిచిన బిఆర్ఎస్ ఈసారి గెలిచి హ్యాట్రిక్ ను సొంతం చేసుకోవాలని చూస్తోంది. కాంగ్రెస్ , బిజెపిలకు చెక్ పెట్టి తమ బలాన్ని ప్రదర్శించాలని ఎదురుచూస్తోంది. అయితే ఈ సారి కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అయింది. బి‌ఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ టఫ్ ఫైట్ తప్పదు.

ఇప్పటికే సీనియర్ నేతలు సి‌ఎం తాము అంటే తాము అని చెప్పుకుంటున్నారు. ఇటీవల కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి..సీఎం నేనే అంటూ, అందరి కోరికపై ముఖ్యమంత్రి అవుతానని అందుకు ఎమ్మెల్యేలు, సోనియాగాంధీ సహకరించాలని వ్యాఖ్యానించారు. ప్రతి మీటింగ్ లోను కోమటిరెడ్డి రాగానే సి‌ఎం సి‌ఎం అంటూ అభిమానులు నినాదాలు చేస్తుండడంతో కోమటిరెడ్డి నిజమని నమ్మారు. ఈయనే కాదు సి‌ఎం పదవి ఆశించే కాంగ్రెస్ నేతలు చాలామంది ఉన్నారు. రేవంత్ రెడ్డి,శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్, భట్టి విక్రమార్క ..ఇలా పలువురు రేసులో ఉన్నారు. కానీ ముందే సి‌ఎం పదవి కోసం రచ్చకు దిగితే కాంగ్రెస్‌కు నష్టం తప్పదు.