అల్వార్ ఎంపీ, బీజేపీ నేత మహంత్ బాలాకాంత్కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదం నుంచి బయటపడింది. గాల్లోకి లేచిన సెకన్ల వ్యవధిలో హెలికాఫ్టర్ మొరాయించింది. గాల్లోనే చక్కర్లు కొడుతూ.. భయాందోళనకు గురి చేసింది. అక్కడే ఉన్న బాలాకాంత్ అనుచరులు పెద్దగా కేకలు వేస్తూ చూస్తూ ఉన్నారు. ఏం జరుగుతుందో అర్థం కానీ అయోమయ పరిస్థితి. అయితే పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో.. హెలికాఫ్టర్ అదుపులోకి వచ్చింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన రాజస్థాన్లోని అల్వార్లో ఆదివారం జరిగింది. ఓ కార్యక్రమంలో పాల్గొని.. తిరుగు ప్రయాణంలో ఉండగా.. ఇది చోటుచేసుకుంది