Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వెళ్లే దారి ఏదైనా పర్లేదు గెలుపు దక్కితే చాలు అన్న లక్ష్యంతో ముందడుగు వేస్తున్న కమల ద్వయం మోడీ , అమిత్ షా ఇంకో ఘనత సొంతం చేసుకున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో కాషాయ జెండా రెపరెపలాడించారు. ఇంతకుముందే ఈశాన్యంలో అస్సాం, మణిపూర్ ని దక్కించుకున్న బీజేపీ ఇప్పుడు కమ్యూనిస్ట్ ల కంచుకోట త్రిపురలో విజయ పతాకం ఎగురవేసింది. దాదాపు 20 సంవత్సరాలుగా అక్కడ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కామ్రేడ్లు ఈసారి ఎన్నికల్లో కమలం దెబ్బకి కమిలిపోయారు.
మొత్తం 59 స్థానాలకు గాను 40 కి పైగా స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటుకి తహతహలాడుతున్నారు. ఇక నాగాలాండ్ లో కూడా మొత్తం 60 స్థానాల్లో 30 కి పైగా సీట్లు గెల్చుకుని ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లో ఖాతా తెరవలేకపోయిన కాంగ్రెస్ ఒక్క మేఘాలయాలో మాత్రం ముందంజలో వుంది. అయితే అక్కడ కాంగ్రెస్ కి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేంత బలం రాలేదు. దీంతో అక్కడ స్వతంత్రులే కొత్త ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తారు.